Credit Cards: ఈ క్రెడిట్ కార్డ్స్‌తో ఇంధనం కొనుగోలు చేస్తే క్యాష్ బ్యాక్ ఆఫర్లు
* ఇండియన్ ఆయిల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ * HDFC భారత్ క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డ్
Credit Cards: పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో సామాన్యుడి జేబుకి చిల్లు పడుతుంది. ఈ ధరలను తట్టుకోలేక కొంతమంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు వెళుతున్నారు. అయితే మీరు వాహనాలలో ఇంధనం కొట్టించేటప్పుడు ఈ క్రెడిట్ కార్డ్స్ వాడితే మీకు క్యాష్ బ్యాక్ ఆఫర్ దొరుకుతుంది. అలాంటి కొన్ని క్రెడిట్ కార్డుల గురించి తెలుసుకుందాం.
1. ఇండియన్ ఆయిల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్
ఈ క్రెడిట్ కార్డ్‌లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపుల వద్ద ఖర్చు చేసే ప్రతి రూ.100కి 1 శాతం ఇంధన సర్‌ఛార్జ్, 20 రివార్డ్ పాయింట్‌ల మినహాయింపు ఉంటుంది. దీంతో మీరు రూ.100 కొనుగోలు చేసినందుకు 5 రివార్డ్ పాయింట్లను పొందుతారు. ఈ క్రెడిట్ కార్డుపై వార్షిక రుసుము రూ. 500.
2. HDFCభారత్ క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డ్
ఈ కార్డ్‌పై చమురు కొనుగోలు చేస్తే 5 శాతం నెలవారీ క్యాష్‌బ్యాక్, ఇంధన సర్‌ఛార్జ్‌పై ఒక శాతం తగ్గింపు లభిస్తుంది. కిరాణా సామాగ్రి కొనుగోలుపై 5 శాతం నెలవారీ క్యాష్‌బ్యాక్, IRCTC ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకోవడంపై 5 శాతం నెలవారీ క్యాష్‌బ్యాక్. ఈ క్రెడిట్ కార్డుపై వార్షిక రుసుము రూ. 500.
3. ఇండియన్ ఆయిల్ సిటీ బ్యాంక్ ప్లాటినం
ఈ కార్డ్‌లో రూ.150 ఖర్చు చేస్తే 4 టర్బో పాయింట్లు ఉంటాయి. కిరాణా, సూపర్ మార్కెట్‌లలో రూ.150 ఖర్చుపై 2 టర్బో పాయింట్‌లను పొందవచ్చు. ఇతర ఖర్చులపై 1 టర్బో పాయింట్ల ప్రయోజనం ఉంటుంది. ఒక టర్బో పాయింట్ ఒక రూపాయి ఉచిత ఇంధనానికి సమానం.
4. BPCL SBI క్రెడిట్ కార్డ్
BPCL SBI క్రెడిట్ కార్డ్ BPCL లావాదేవీలపై రూ.4,000 వరకు 3.25% రివార్డ్ పాయింట్లు, 1% ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపును అందిస్తుంది. కార్డ్ సహాయంతో కిరాణా, డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లు, సినిమాలు, డైనింగ్‌లపై ఖర్చు చేసే ప్రతి 100 రూపాయలకు 5 రెట్లు ఎక్కువ రివార్డ్ పాయింట్‌లు అందుబాటులో ఉంటాయి. ఈ క్రెడిట్ కార్డ్‌పై వార్షిక రుసుము రూ. 499.