Case filed against Shashank Bhargava: మహిళా కేంద్ర మంత్రిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు

Case filed against Shashank Bhargava: మహిళా కేంద్ర మంత్రిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో మధ్యప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది.

Update: 2020-06-26 07:39 GMT

Case filed against Shashank Bhargava: మహిళా కేంద్ర మంత్రిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో మధ్యప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. విడిషా నియోజకవర్గ ఎమ్మెల్యే శశాంక్ భార్గవపై కేసు నమోదు చేసినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ వీరేంద్ర జహ తెలిపారు. ఆయనపై విడిషా మునిసిపాలిటీ చైర్‌పర్సన్, కొంతమంది బిజెపి కార్యకర్తలు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ ఇటీవల కాంగ్రెస్ పిలుపునిచ్చిన సైకిల్ ర్యాలీలో భార్గవ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు.

"కేంద్ర ప్రభుత్వంలో చాలా ఎక్కువగా గాజులు ధరించే మంత్రి ఉన్నారు.. ఆమెకు మీడియా ద్వారా విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను, ఆమె ప్రధాని నరేంద్ర మోడీకి చాలా సన్నిహితురారు.. ఆమె ప్రధానికి గాజులు ఇచ్చి ఇంధన ధరల పెంపును వెనక్కి తీసుకురావాలని వ్యాఖ్యానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో భార్గవ చేసిన తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలపై స్థానిక బీజేపీ నాయకత్వం తీవ్రంగా స్పందించింది, ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలపై .. విదిషా మునిసిపాలిటీ చైర్మన్ ముఖేష్ టాండన్ ఇతర పార్టీ కార్యకర్తలతో కలిసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వారు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సదరు కాంగ్రెస్ ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Tags:    

Similar News