India: బ్రిటన్‌ ప్రభుత్వం నుంచి మూడు భారీ ఆక్సిజన్‌ ప్లాంట్లు

India: దేశంలో ఆక్సిజన్‌ కొరత తీర్చేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం మూడు భారీ ఆక్సిజన్‌ ప్లాంట్లను ఇండియాకు పంపించింది.

Update: 2021-05-09 03:30 GMT

India: బ్రిటన్‌ ప్రభుత్వం నుంచి మూడు భారీ ఆక్సిజన్‌ ప్లాంట్లు

India: దేశంలో ఆక్సిజన్‌ కొరత తీర్చేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం మూడు భారీ ఆక్సిజన్‌ ప్లాంట్లను ఇండియాకు పంపించింది. ప్రపంచంలోనే అతి పెద్ద కార్గో విమానమైన ఆంటోనోవ్‌ 124 వీటిని తీసుకుని భారత్‌ బయల్దేరింది. ఈ విమానం ఆదివారం ఉదయానికి ఢిల్లీ చేరుకుంటుంది. 40 అడుగుల కంటెయినర్ల పరిమాణంలో ఉంటే ఈ ఆక్సిజన్‌ జనరేటర్లు ఒక్కొక్కటి 18 టన్నుల బరువుంటుంది.

ఒక్కొక్కటి నిమిషానికి 500 లీటర్ల ప్రాణవాయివును ఉత్పత్తి చేస్తుంది. ఈ మూడు జనరేటర్లను విమానంలో ఎక్కించడానికి ఎయిర్‌పోర్టు సిబ్బందికి ఒక రాత్రంతా పట్టినట్లు చెబుతున్నారు. ఆక్సిజన్‌ ప్లాంట్లతో పాటు వెయ్యి వెంటిలేటర్లు కూడా బ్రిటన్‌ పంపించింది. ఇంతకుముందే బ్రిటన్‌ ప్రభుత్వం 200 వెంటిలేటర్లు, 495 ఆక్సిజన్ కాన్నంట్రేటర్లు కూడా పంపించింది.

Tags:    

Similar News