Corona Vaccine: డయాబెటిస్ ఉన్నవారు ఈ టీకా వేసుకోవచ్చా?
Corona Vaccine: ఇతర వ్యాధులతో బాధపడేవారు వ్యాక్సిన్ పట్ల ఎక్కువగా ఆలోచిస్తున్నారు.
Corona Vaccine: ఇతర వ్యాధులతో బాధపడేవారు వ్యాక్సిన్ పట్ల ఎక్కువగా ఆలోచిస్తున్నారు. డయాబెటిస్ ఉన్నవారు ఈ టీకా వేసుకోవచ్చా? వారికి సురక్షితమా? అనే అనుమానాలు చాలా మందిలో మెదులుతున్న ప్రశ్నే. వీటిపై నిపుణులు పలు సూచనలు చేశారు. డయాబెటిస్ ఉన్నవాళ్లు వ్యాక్సిన్ తీసుకోవడం సురక్షితమేనని, ఎలాంటి దుష్ర్భవాలు ఉండవని నిపుణులు అంటున్నారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి టీకా అత్యవసరం అని సీడీసీ నొక్కి చెప్పింది. ఇక ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రాధాన్యతను బట్టి మధుమేహం ఉన్నవారికి ఈ టీకాలు ఇస్తారు.
టీకా తొలి ప్రాధాన్యం ఎవరికి అనేది సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నిర్ణయిస్తుంది. ఈ మార్గదర్శకాలు ప్రస్తుత పరిస్థితులను బట్టీ మారుతుంటాయి. టైప్ 2 డయాబెటిస్ ఇతర దీర్ఘ కాలిక ఆరోగ్య సంబంధ సమస్యలు ఉన్నవారికి టీకా వేయాలని సీడీసీ నిర్ణయిస్తుందని నిపుణులు అంటున్నారు. టైప్ 1 డయాబెటిస్ ఎలాంటి ప్రాధాన్యత టీకాలు ఉండవని తెలిపారు. టీకా ప్రాధాన్యతలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటాయని చెబుతున్నారు. స్థానికంగా ఉన్న ఆరోగ్య కేంద్రాల్లో టీకా ప్రాధాన్యత అంశానికి సంబంధించిన సమాచారం పొందవచ్చని సూచించారు.
డయాబెటిస్ ఉన్నవారిపై కోవిడ్ తీవ్రంగా ప్రభావం చూపుతుందని వైద్యులు తెలిపారు. గతంలో మరణించిన వాళ్లలోనూ మధుమేహం ఉన్నవారే అధికంగా ఉన్నారని నిపుణులు అంటున్నారు. కాబట్టి వారికి వ్యాక్సిన్ అత్యవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టైప్ 1 టైప్ 2 మధుమేహం ఉన్నవాళ్లకు టీకా తప్పనిసరి అని సీడీసీ ఇదివరకే స్పష్టం చేసింది. కాబట్టి మధుమేహం ఉన్న వారు కచ్చితంగా టీకా తీసుకోవాలని సూచిస్తున్నారు. మధుమేహం ఉన్నవారిలోనూ టీకా మంచి ఫలితాలు ఇచ్చిందని నిపుణులు వెల్లడించారు. కేవలం డయోబెటిస్ మాత్రమే కాకుండా ఇతర దీర్ఘకాలిక సంబంధ వ్యాధులు ఉన్నవారిలోని మంచి ఫలితాలు కనిపించాయని చెప్పారు.
దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 12,08,329 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..1,15,736 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రెండు రోజుల క్రితం మొట్టమొదటిసారిగా రోజూవారీ కేసులు లక్ష మార్కు(1,03,558)ను దాటాయి. తాజాగా మరోసారి అంతకుమించిన కేసులు నమోదయ్యాయి. నిన్న మరణాల సంఖ్యలో కూడా భారీ పెరుగుదల కనిపించింది. 630 మంది మృత్యుఒడికి చేరుకున్నారని బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం 1.28 కోట్ల మందికి పైగా వైరస్ బారిన పడగా.. 1,66,177 మంది ప్రాణాలు కోల్పోయారు.