Maharashtra: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం

Maharashtra: అజ్ఞాతంలో ఏక్ నాథ్ సింగ్ తో సహా 12 మంది ఎమ్మెల్యేలు

Update: 2022-06-21 05:13 GMT

Maharashtra: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం

Maharashtra: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం మహావికాస్ అగాడీలో విభేదాలు చోటు చేసుకున్నాయి. విదానపరిషత్తు ఎన్నికల ఫలితాలతో శివసేన రెండు వర్గాలుగా చీలిపోయింది. దీంతో శివసేన పార్టీలో గందరగోళం కొనసాగుతోంది. సూరత్ కు చెందిన ఓ నాయకుడు ఈ వ్యవహారంలో చక్రం తిప్పుతున్నట్టు తెలుస్తోంది.

మహారాష్ట్ర విదానపరిషత్తు కు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. దీంతో సంకీర్ణ సర్కార్ కు ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం ఆధారంగా 10 సీట్లలో సంకీర్ణ ప్రభుత్వం 6 సీట్లు, బీజేపీ 4 స్థానాల్లో విజయం సాధించింది. సంకీర్ణ ప్రభుత్వంలోని పలువురు శాసనసభ్యులు క్రాస్ ఓటింగ్ కు పాల్పడటంతో కాంగ్రెస్ రెండవ అభ్యర్ధి ఓడిపోగా, బీజేపీ తరుపున ఐదో అభ్యర్థి విజయం సాధించారు. దీంతో శివసేనలో అలజడి మొదలైంది.

శివసేన సీనియర్ లీడర్ ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో 12 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. గుజరాత్ లోని సూరత్ లో తిరుగుబాటు ఎమ్మెల్యేలతో ఏక్ నాథ్ క్యాంప్ నిర్వహించినట్టు తెలుస్తోంది. నిన్నటి విదానపరిషత్తు ఫలితాల తర్వాత శివసేన నేతలకు ఈ 12 మంది ఎమ్మెల్యేలు అందుబాటులో లేరు. దీంతో శివసేన అధిష్టానంలో గందరగోళం కొనసాగుతోంది.

మహారాష్ట్ర అసెంబ్లీలో పార్టీల బలాబాలను పరిశీలిస్తే, అధికార మహావికాస్ అగాడీ కూటమిలో శివసేనకు 56 మంది ఎమ్మెల్యేలు, ఎన్సీపీ 53, కాంగ్రెస్ కు 44 మంది, ఇతరులు 16 మంది ఉన్నారు. ప్రతిపక్ష బీజేపీ కూటమిలో బీజేపీకి 106 మంది ఎమ్మెల్యేలు, ఇతరులు ఏడుగురు ఉన్నారు. శివసేన సీనియర్ నేత ఏక్ నాథ్ షిండే తిరుగుబాటుతో శివసేనకు 11 మంది ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు.

ఏక్ నాథ్ షిండే వెంట ఉన్న శాసనసభ్యులు సూరత్ లోని ఓ హోటల్ లో మకాం వేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగినట్టు అనుమానం రావడంతో సీఎం ఉద్దవ్ ఠాక్రే ఇవాళ శివసేన ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలందరూ సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని సమాచారం ఇచ్చారు. 

Tags:    

Similar News