Cabinet Approves: ఉద్దీపన ప్యాకేజీకి కేంద్ర కేబినెట్‌ ఆమోదం

Cabinet Approves: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రెండు రోజుల క్రితం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీకి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Update: 2021-06-30 15:30 GMT

Cabinet Approves: ఉద్దీపన ప్యాకేజీకి కేంద్ర కేబినెట్‌ ఆమోదం

Cabinet Approves: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రెండు రోజుల క్రితం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీకి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రధాని మోడీ అధ్యక్షతన కేబినెట్‌ భేటీ జరిగింది. 3.03 లక్షల కోట్ల రూపాయల విలువైన సంస్కరణ-ఆధారిత, ఫలిత-అనుసంధాన పవర్ డిస్కం పథకాన్ని కేబినెట్ ఆమోదించినట్లు ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు. అలాగే దేశంలోని అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని నిర్ణయిందని తెలిపారు. 16 రాష్ట్రాల్లోని గ్రామాల్లో బ్రాడ్‌బ్యాండ్ సేవలకు భారత్‌నెట్ ప్రాజెక్టును ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య మోడ్ కింద రు.19,041 కోట్లతో కేబినెట్ ఆమోదించినట్లు టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు.

Tags:    

Similar News