శుక్రవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు..ఫిబ్రవరి 1న బడ్జెట్‌

ఫిబ్రవరి 1న బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్‌ ఉ.9 గంటల నుంచి మ.2 గంటల వరకు రాజ్యసభ సా.5 గంటల నుంచి రా.8 గంటల వరకు లోక్‌సభ సెంట్రల్‌ హాల్‌లో ప్రసంగించనున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కరోనా టెస్టులు చేయించుకున్న ఎంపీలు, ఎంపీల పీఏలు

Update: 2021-01-28 15:45 GMT
శుక్రవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు..ఫిబ్రవరి 1న బడ్జెట్‌

కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రధాన ప్రతిపక్ష పార్టీలు భగ్గుమన్నాయి. కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. రేపటి నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రాతినిథ్యం కల్గిన 16 ప్రతిపక్ష పార్టీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.

పార్లమెంట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. శుక్రవారం నుంచి సమావేశాలు ప్రారంభంకానుండగా.. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. రాజ్యసభ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, లోక్‌సభ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరగనుంది. రాష్ట్రపతి ప్రసంగం సెంట్రల్‌ హాల్‌లో ఉండనుండగా సమావేశాలకు వచ్చే ఎంపీలు, వారి పీఏలు, వ్యక్తిగత సిబ్బంది కరోనా పరీక్షలు చేయించుకున్నారు.

ఇదిలా ఉంటే కేంద్ర విధానాలపై ప్రతిపక్ష పార్టీలు భగ్గుమంటున్నాయి. నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. అంతేకాదు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ 16 ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బాయ్‌కాట్‌ చేయాలని నిర్ణయించాయి. అదేవిధంగా చమురు ధరల పెరుగుదలపై ఉభయసభల్లో నిరసన తెలుపాలని డిసైడ్‌ అయ్యాయి. ఢిల్లీలో జరిగిన విధ్వంస ఘటనపై కుట్రదారులెవరో తేల్చాల్సిన అవసరం ఉందని ఇందుకోసం నిష్పాక్షికంగా దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేయనున్నారు.

మరోవైపు పార్లమెంట్‌ క్యాంటీన్‌లో ఆహార పదార్ధాల ధరలు పెరిగాయి. పెరిగిన ధరలు రేపటి నుంచి అమల్లోకి రానుండగా అందరి ఫేవరెట్‌గా ఉండే హైదరాబాద్‌ బిర్యానీ 65 రూపాయల నుంచి 150 రూపాయలకు పెంచారు. వెజ్‌ బఫె 500, నానా వెజ్‌ బఫె 700 రూపాయలకు పెంచుతూ కొత్త మెనూను రిలీజ్‌ చేశారు. అతి తక్కువ ధర అంటే చపాతీనే 3 రూపాయలకు ఉడకబెట్టిన కూరగాయలు 50 రూపాయలకు లభించున్నాయి. కరోనా కారణంగా చర్యలు తీసుకోవడంతోపాటు పెరిగన ధరల దృష్ట్యా దశాబ్దాలుగా అందిస్తున్న రాయితీలను ప్రభుత్వం తొలగించింది.

Tags:    

Similar News