Union Budget 2021: ఆరోగ్య రంగానికి పెద్దపీట

Update: 2021-02-01 06:29 GMT

Union Budget 2021: ఆరోగ్య రంగానికి పెద్దపీట

బడ్జెట్‌ 2021-22లో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేసింది. కొవిడ్‌ నేపథ్యంలో ఈ రంగానికి కేటాయింపులు భారీగా పెంచింది. ఆత్మనిర్బర్‌ ఆరోగ్య పథకానికి మొత్తం రూ.2,23,846 కోట్లు కేటాయించినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో వెల్లడించారు. నివారణ, చికిత్స, సంపూర్ణ ఆరోగ్య విధానంలో ఈ పథకం రూపొందించినట్టు వివరించారు. కొత్తగా 9 బీఎస్‌ఎల్‌-3 స్థాయి ప్రయోగశాలలు, 15 అత్యవసర ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మల తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి కోసం ప్రధాని 'జల్‌జీవన్‌ మిషన్‌ అర్బన్‌' తీసుకురానున్నట్టు తెలిపారు. రక్షిత మంచినీటి పథకాల కోసం రూ.87 వేల కోట్లు కేటాయించామన్నారు. దేశంలో 2 కోట్ల 18 లక్షల ఇళ్లకు మంచినీరు, స్వచ్ఛ భారత్‌ మిషన్‌కు లక్షా 41 వేల 678 కోట్లు కేటాయించామన్నారు. రూ.87 వేల కోట్లతో 500 నగరాల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఘనవ్యర్థాల నిర్వహణ కోసం స్వచ్ఛభారత్‌ అర్బన్‌ తీసుకురానున్నట్టు తెలిపారు.

Tags:    

Similar News