పదో తరగతితో కొలువులు.. జీతం 20 నుంచి 60 వేల వరకు..!

BSF Recruitment 2022: దేశ రక్షణ దళంలో పనిచేయాలనుకునే యువకులకు ఇది సువర్ణవకాశమని చెప్పవచ్చు.

Update: 2022-02-24 12:02 GMT

పదో తరగతితో కొలువులు.. జీతం 20 నుంచి 60 వేల వరకు..!

BSF Recruitment 2022: దేశ రక్షణ దళంలో పనిచేయాలనుకునే యువకులకు ఇది సువర్ణవకాశమని చెప్పవచ్చు. బీఎస్‌ఎఫ్ నుంచి ట్రేడ్‌ మెన్‌ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకి అప్లై చేయాలనుకునేవారు పదో తరగతి, ఐటీఐ చదివి ఉంటే చాలు. ఎంపికైతే 20 వేల నుంచి దాదాపు 60 వేల వరకు జీతం ఉంటుంది. ఇతర ప్రభుత్వ అలవెన్స్‌లు ఉంటాయి. మొత్తం పోస్టుల సంఖ్య 2788. వీటిల్లో పురుషులకు 2651, మహిళలకు 137 పోస్టులను కేటాయించారు.

అర్హతలు ఈ విధంగా ఉండాలి..

పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి. ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఐటీఐ) నుంచి ఏడాది సర్టిఫికేట్‌ కోర్సు/రెండేళ్ల డిప్లొమా లేదా తత్సమాన కోర్సు చదివి ఉండాలి. వయసు 01.08.2021 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ రిజర్వేషన్లకు అనుగుణంగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. పురుష అభ్యర్థులు ఎత్తు 167.5 సెం.మీ, ఛాతీ కొలత 78–83 సెం.మీ మధ్య ఉండాలి. స్త్రీలు157 సెం.మీ ఎత్తు ఉండాలి.

ఎంపిక విధానం

ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌(పీఎస్‌టీ), ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌(పీఈటీ), డాక్యుమెంటేషన్, ట్రేడ్‌ టెస్ట్, రాత పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. హైట్‌ టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులని మాత్రమే పీఈటీ పరీక్షలకి ఎంపిక చేస్తారు. ఇందులో పురుషులు 5 కిలోమీటర్ల దూరాన్ని 24 నిమిషాల్లో పరుగెత్తాలి. స్ట్రీలు 1.6 కిలో మీటర్ల దూరాన్ని 8.30 నిమిషాల్లో పరుగెత్తాలి. ఈ టెస్టులన్నింటిలో అర్హత సాధించిన వారికి 100 మార్కులకు రిటన్ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఇందులో వచ్చిన మెరిట్‌ ఆధారంగా ఉద్యోగాలు కేటాయిస్తారు.

Tags:    

Similar News