BS Yediyurappa: రాజీనామా చేసే ముందు భావోద్వేగానికి గురైన యడ్యూరప్ప

BS Yediyurappa: కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

Update: 2021-07-26 15:45 GMT

BS Yediyurappa: రాజీనామా చేసే ముందు భావోద్వేగానికి గురైన యడ్యూరప్ప 

BS Yediyurappa: కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎట్టకేలకు సీఎంగా యడ్యూరప్ప అనేక రాజకీయ పరిణామాల మధ్య ఎట్టకేలకు కర్ణాటక సీఎం యడ్యూరప్ప రాజీనామా చేశారు. రాష్ట్రంలో బీజేపీ సర్కారు రెండేళ్లు పూర్తి చేసుకున్న రోజే ఆయన సీఎం పీఠం నుంచి వైదొలిగారు. దీంతో కర్ణాటకలో కొత్త నాయకత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాషాయ పార్టీ సిద్దమవుతుండగా తదుపరి సీఎం ఎవరనేది ఆసక్తిగా మారింది.

సీఎం పదవికి రాజీనామా చేసే ముందు యడియూరప్ప భావోద్వేగానికి గురైయ్యారు. పదవిలో ఉన్న ప్రతిక్షణం అగ్ని పరీక్షను ఎదుర్కొన్నానంటూ ఆయన ఆవేదన చెందారు. ఓ రాష్ట్రానికి సీఎం అవడం అంటే మామూలు విషయం కాదని చెబుతూనే సీఎం అయిన తరువాత 5 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగడం అంతకంటే పెద్ద సవాల్ అని అభిప్రాయపడ్డారు. కర్ణాటక రాష్ట్రానికి నాలుగు సార్లు సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఒక్కాసారి కూడా ఐదేళ్ల పాటు పూర్తిస్థాయిలో అధికారంలో ఉండలేకపోవడమే ఈ వ్యాఖ్యలకు కారణం. రాజకీయ కుట్రలు, అవినీతి ఆరోపణలు కారణమేదైనా సీఎం పీఠం మాత్రం ఆయనకు ముళ్ల కుర్చీగా మారిందనే చెప్పాలి.

యడియూరప్ప రాజీనామాతో సీఎం రేసులో పలువురు నేతల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. లింగాయత్‌ సామాజికవర్గం నుంచి పంచమసలి, అరవింద్‌ బెళ్లేడ్‌, మురుగేష్‌ నిరని పేర్లు వినిపిస్తుండగా గౌడ సామాజికవర్గం నుంచి బసంగౌడ, హోంమంత్రి బస్వరాజ్‌ బొమ్మై, మాజీ కేంద్రమంత్రి సదానంద గౌడ, బీజేపీ జనరల్‌ సెక్రటరీ సీటీ రవితో పాటు సీనియర్‌ నాయకులు అశోక్‌ అండ్, అశ్వత్‌ నారాయణ రేసులో ఉన్నారు. కాగా కర్ణాటక నూతన సీఎం ఎంపిక పరిశీలకుడిగా ధర్మేంద్ర ప్రధాన్‌ నియమితులయ్యారు. రేపు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కొత్త సీఎం పేరు ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. యడ్యూరప్ప రాజీనామాతో హీటెక్కిన కన్నడ రాజకీయం కొత్త సీఎం ఎంపికతో తెర పడుతుందో లేదో చూడాలి మరి.

Tags:    

Similar News