ఢిల్లీలో బీఆర్‌ఎస్ ఆఫీస్ సిద్ధం..!

Delhi: బీఆర్‌ఎస్‌ పార్టీ తాత్కాలిక భవనం ఏర్పాటు

Update: 2022-10-06 04:15 GMT

ఢిల్లీలో బీఆర్‌ఎస్ ఆఫీస్ సిద్ధం..!

Delhi: ఢిల్లీలో భారత్ రాష్ట్ర సమితి కార్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. సర్ధార్ పటేల్ రోడ్డులోని జోధ్ పూర్ రాజ వంశీయుల బంగ్లా లీజుకు తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. నూతన పార్టీ కార్యాలయాన్ని రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. భారత్ రాష్ట్ర సమితి పార్టీ ప్రకటన నేపథ్యంలో వసంత్ విహార్ లో నిర్మాణ పనులను వేగవంతం చేయనున్నారు. వచ్చే ఆరు నెలల్లో భవన నిర్మాణ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోనున్నారు.

లీజుకు తీసుకున్న ఈ భవనంలో బీఆర్ఎస్ కొంత కాలం పాటు కొనసాగనుంది. ఇటీవి ఢిల్లీ పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాలయం కోసం ఈ భవనాన్ని ఎంపిక చేయగా... టీఆర్ఎస్ నేతలు సదరు భవనాన్ని లీజుకు తీసుకున్నారు. అటు పార్టీ కార్యాలయ నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఈ భవన నిర్మాణం శర వేగంగా సాగుతోంది. ఈ భవన నిర్మాణం పూర్తి అయ్యేదాకా సర్దార్ పటేల్ మార్గ్ లో అద్దెకు తీసుకున్న భవనంలో బీఆర్ఎస్ కార్యాలయం కొనసాగనుంది. ఈ మేరకు అద్దెకు తీసుకున్న భవనానికి ఇప్పటికే బీఆర్ఎస్ రంగులు అద్దినట్లు సమాచారం.

Full View


Tags:    

Similar News