తమిళనాడులో పెళ్లికొడుకుకి షాక్ ఇచ్చిన పెళ్లి కూతురు!
తమిళనాడులోని నీలగిరి జిల్లాలో తాళికట్టే సమయంలో పెళ్లికొడుకుకి షాక్ ఇచ్చింది పెళ్లికూతురు. జిల్లాలోని కోతగిరిలో నివాసముంటున్న ప్రియదర్శినికి కుటుంబసభ్యులు ఓ వ్యక్తితో పెళ్లి ఫిక్స్ చేశారు.
తమిళనాడులోని నీలగిరి జిల్లాలో తాళికట్టే సమయంలో పెళ్లికొడుకుకి షాక్ ఇచ్చింది పెళ్లికూతురు. జిల్లాలోని కోతగిరిలో నివాసముంటున్న ప్రియదర్శినికి కుటుంబసభ్యులు ఓ వ్యక్తితో పెళ్లి ఫిక్స్ చేశారు. అంగరంగ వైభవంగా పెళ్లి ఏర్పాట్లు చేశారు. నూతన వధువువరులను ఆశీర్వదించడానికి బంధువులంతా విచ్చేశారు. ఇక తాళికట్టడమే తరువాయి. సడన్‌గా పెళ్లికూతురు ఒకే ఒకమాట చెప్పడంతో పెళ్లికొడుకు ఖంగు తిన్నాడు. అరగంటలో తన ప్రియుడు వస్తాడని తనకు ఈ పెళ్లి ఇష్టంలేదని చెప్పేసింది. కుటుంబసభ్యులు ఎంత వారించిన పెళ్లికూతురు మాట వినలేదు. దీంతో పెళ్లి కొడుకు పెళ్లి మండపం నుంచి వెళ్లిపోయాడు. ఇటు ప్రేమించిన యువకుడు రాకపోవడంతో పెళ్లి కూతురుని కూడా అక్కడే వదిలేసి వెళ్లిపోలేసియారు. ఇక పెళ్లి కూతురు ఒంటరిగా మిగిలిపోయింది. ప్రస్తుతం న్యూస్ వైరల్ అవుతుంది.