Brazil President Bolsonaro: మాస్క్ పెట్టుకోనందుకు బ్రెజిల్ అధ్యక్షుడి పై కేసు

Brazil President Bolsonaro: కోవిడ్ అతిక్రమించిన బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో పై కేసు నమోదు అయ్యింది.

Update: 2021-05-24 01:28 GMT

Brazil President Bolsonaro:(The Hans India)

Brazil President Bolsonaro: ఆ దేశంలో అందరూ ఒక్కటే . ప్రపంచాన్నే గడగడలాండిచిన కరోనా మహమ్మారి ఆ దేశాన్ని కూడా వదిలి పెట్టలేదు. ఆ మహామ్మారి ప్రభావానికి గురైన దేశాల్లో బ్రెజిల్ ఒకటి. దీంతో ఆ దేశంలో కఠిన ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో బ్రెజిల్ దేశాధ్యక్షుడు జైర్ బోల్సొనారోకు కూడా మినహాయింపు ఇవ్వలేదు. మాస్కు ధరించకుండా ఓ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆయనపై కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు అక్కడ 1.6 కోట్ల మంది కరోనా బారినపడ్డారు. 4.48 లక్షల మంది మృత్యువాతపడ్డారు.

మారనావో రాష్ట్రంలో ఆస్తి పట్టాల పంపిణీ కార్యక్రమం జరగ్గా, దేశాధ్యక్షుడు బోల్సొనారో చీఫ్ గెస్టుగా విచ్చేశారు. మాస్కు ధరించకపోగా, ఆ రాష్ట్ర ప్రభుత్వ పెద్దపై వ్యాఖ్యలు చేశారు. దేశాధినేత అయినా సరే మాస్కు లేకుండా కనిపించడంతో కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని మారనావో గవర్నర్ ఫ్లావియో డైనో నిర్ధారించారు. చట్టం ఎవరికైనా ఒక్కటేనని డైనో స్పష్టం చేశారు.

బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సొనారో వైఖరి ఇప్పుడే కాదు, కొవిడ్ వ్యాప్తి మొదలైనప్పటినుంచి ఇలాగే ఉంది. ఓసారి మీడియాతో మాట్లాడుతూ ఒక్కసారిగా మాస్కు తీసేసి అందరినీ హడలగొట్టారు. దేశంలో కరోనా మార్గదర్శకాల అమలులో విఫలం అయ్యారంటూ బోల్సొనారో చెడ్డపేరు తెచ్చుకున్నారు. అదే మన దేశంలో అయితే రూల్స్ అతిక్రమించినా పట్టించుకునే నాధుడే లేరని సదరు ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News