Coronavirus: బ్రెజిల్ ప్రభుత్వం మహిళలకు కీలక సూచన
Coronavirus: ప్రజల జీవితాలను కరోనా సంక్షోభం ఎంతలా మార్చేసిందో బ్రెజిల్ ప్రభుత్వం తాజా సూచన వింటే అర్థమవుతుంది.
Coronavirus: ప్రజల జీవితాలను కరోనా సంక్షోభం ఎంతలా మార్చేసిందో బ్రెజిల్ ప్రభుత్వం తాజా సూచన వింటే అర్థమవుతుంది. కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకువస్తుండటంతో ఏం చేయాలో తెలియక ప్రపంచ దేశాలు తలపట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లల్ని కనాలన్న ప్రయత్నాలను కొంత కాలం పాటు వాయిదా వేసుకోవాలని మహిళలకు బ్రెజిల్ ప్రభుత్వం సూచించింది. మునుపటి వైరస్‌తో పోలీస్తే కొత్త వేరియంట్లు గర్భవతులకు ఎక్కువగా సోకుతుందని తెలిపింది. ఆరోగ్య వ్యవస్థలపై ఒత్తిడి ఎక్కువగా పడకుండా ఉండేందుకు కూడా ఇది అవసరమని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా పేర్కొంది. కరోనా తీవ్రత తగ్గే వరకూ ఈ ఆలోచనను తాత్కాలికంగా పక్కన పెట్టాల్సి స్పష్టం చేసింది.