అర్నాబ్ బెయిల్ ను తిరస్కరించిన బాంబే హైకోర్టు
రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామికి బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. 2108 నాటి ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య కేసులో అరెస్టైన అర్నాబ్.. తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు
రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామికి బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. 2108 నాటి ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య కేసులో అరెస్టైన అర్నాబ్.. తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు అర్నాబ్ పిటిషన్‌ను తిరస్కరించింది. అయితే బెయిల్ కోసం దిగువ కోర్టులో దరఖాస్తు చేసుకొనే వెసలుబాటు కల్పించింది. ఆయన బెయిల్ కోసం అలీబాగ్ సెషన్స్ కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు.
వచ్చే శుక్రవారం లోపు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టాలని హైకోర్టు సెషన్ కోర్టును ఆదేశించింది. ఇదిలా ఉండగా.. జ్యుడిషియల్ కస్టడీలోఉన్నఅర్నబ్ మొబైల్ ఫోన్ వాడుతున్నట్లు సమాచారం రావడంతో ఆయనను తలోజా జైలుకు తరలించారు. ఇక 2018 లో 53 ఏళ్ల ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్ మరియు అతని తల్లి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారంటూ అర్నాబ్ సహా మరో ఇద్దరిపై ఐపీసీ సెక్షన్ 304. సెక్షన్ 34 ల కింద నమోదు చేసి అరెస్టు చేశారు.