నదిలో ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదుల మృతదేహాలు..
జమ్మూ కాశ్మీర్‌లోని బండిపోరా జిల్లాలో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) సమీపంలో ఉన్న కిషన్‌గంగా నది నుంచి ఇద్దరు..
జమ్మూ కాశ్మీర్‌లోని బండిపోరా జిల్లాలో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) సమీపంలో ఉన్న కిషన్‌గంగా నది నుంచి ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదుల మృతదేహాలను శనివారం స్వాధీనం చేసుకున్నారు భద్రతా అధికారులు. పాకిస్తాన్ ఆక్రమిత-కాశ్మీర్ (పిఒకె) నుంచి చొరబడటానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ఇద్దరు ఉగ్రవాదులు గురేజ్ సెక్టార్‌లోని మలంగం తులైల్ గ్రామానికి సమీపంలో నదిలో మునిగిపోయినట్లు భద్రతా అధికారులు భావిస్తున్నారు. ఉగ్రవాదులలో ఒకరిని పుల్వామా జిల్లాలోని డేంజర్‌పోరా నివాసి సమీర్ అహ్మద్ భట్ గా గుర్తించారు.
ఇతర ఉగ్రవాదిని పుల్వామాలోని త్రాల్ లోని దాదసర నివాసి నిసార్ అహ్మద్ రాథర్ గా గుర్తించారు. వారిద్దరూ హిజ్బుల్ ముజాహిదీన్ తో సంబంధాలు ఏర్పరచుకున్నారు. వీరు 2018 నుండి తమ ఇళ్లనుంచి అదృశ్యం అయినట్టు అధికారులు భావిస్తున్నారు. అధికారులు వారి వద్ద నుండి ఒక ఆధార్ కార్డు , డ్రైవింగ్ లైసెన్స్ స్వాధీనం చేసుకున్నారు.అలాగే నాలుగు మణికట్టు గడియారాలు, 116 ఎకె ఆర్‌డిఎస్, నాలుగు ఎకె మ్యాగజైన్‌లు, 169 ఎంఎం ఆర్‌డిఎస్, ఒక గ్రెనేడ్‌ను స్వాధీనం చేసుకున్నారు.