Black Fungusను అంటువ్యాధిగా ప్రకటించండి: కేంద్రం

Black Fungus: భారత్‌లో కరోనా రెండో ద‌శ వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది.

Update: 2021-05-20 15:59 GMT

బ్లాక్‌ ఫంగస్‌,

Black Fungus: భారత్‌లో కరోనా రెండో ద‌శ వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది. మరోవైపు క‌రోనా నుంచి నుంచి కోలుకున్న వారిని బ్లాక్‌ ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌ కలవరపెడుతోంది. దీంతో కేంద్రం దీన్ని అంటువ్యాధుల చట్టం (ఎపిడెమిక్‌ డిసీజెస్‌ యాక్ట్‌) కింద పరిగణించాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర వైద్య‌ ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ రాష్ట్రాలకు లేఖను పంపారు. ఇప్పటికే రాజస్థాన్‌, తెలంగాణ రాష్ట్రాలు బ్లాక్‌ ఫంగస్‌ను అంటువ్యాధిగా ప్రకటించాయి.

ఇకపై బ్లాక్‌ ఫంగస్‌ నిర్ధారణ అయిన వారి వివరాలను రాష్ట్రాలు కేంద్ర హోంశాఖకు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ''అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, కళాశాలలు బ్లాక్‌ ఫంగస్‌ నిర్ధారణ, చికిత్సకు కేంద్రం సూచించిన మార్గదర్శకాలు అనుసరించాలి'' అని ఆయన పేర్కొన్నారు.మహారాష్ట్రలో ఇప్పటివరకు 1,500 మందిలో బ్లాక్‌ ఫంగస్‌ను గుర్తించారు. వారిలో 90 మంది మరణించారు. రాజస్థాన్‌లో 100 మందికి పైగా బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడ్డారు. తమిళనాడులో ఈ తరహా కేసులు 9 నమోదయ్యాయి. మ‌రోవైపు వైట్ ఫంగ‌స్ ముప్పుకూడా ఉంద‌ని వైద్య‌లు హెచ్చ‌రిస్తున్నారు. డ‌యాబెటిస్, రోగ‌నిరోధ‌క శ‌క్తి ఎక్కువ‌గా ఉన్న‌వారికి కూడా వైట్ ఫంగ‌స్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు.

Tags:    

Similar News