Black Fungus: కరోనా విజేతలను వెంటాడుతున్న బ్లాక్ ఫంగస్
Black Fungus: కరోనా విజేతలను మరో భయం వెంటాడుతోంది. వైరస్ నుంచి కోలుకున్నామనే సంతోషించేలోపే బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ వణుకు పుట్టిస్తోంది.
Black Fungus: కరోనా విజేతలను మరో భయం వెంటాడుతోంది. వైరస్ నుంచి కోలుకున్నామనే సంతోషించేలోపే బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ వణుకు పుట్టిస్తోంది. గుజరాత్, ఢిల్లీల్లో మ్యుకోర్ మైకోసిస్ కేసులు బయటపడ్డాయి. గత 15 రోజుల్లో సూరత్‌లో 40 మందికి బ్లాక్ ఫంగస్ సోకింది. ఇందులో 8మంది కంటిచూపు కోల్పోయారు. వీళ్లంతా ఆసుపత్రిలో ఉంటూ చికిత్స పొందుతున్నారు. అలాగే ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రిలో ఆరుగురికి బ్లాక్ ఫంగస్ లక్షణాలు బయటపడ్డాయని అక్కడి వైద్యులు వెల్లడించారు. కరోనా పేషెంట్లు త్వరగా కోలుకునేందుకు అధికంగా స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. ఈ మందులే ఫంగస్ దాడికి కారణమవుతోందని డాక్టర్లు చెబుతున్నారు. డయాబెటిస్, కిడ్నీ, గుండె, క్యాన్సర్ వ్యాధులతో బాధపడేవారిలోను, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వారిలో దీని ఎఫెక్ట్ కనిపిస్తుందని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు.