Black Fungus: కోవిడ్-19 నుండి కోలుకున్నా.. తప్పని ముప్పు
Black Fungus: డాక్టర్లను సైతం కలవరపెడుతున్న బ్లాక్ ఫంగస్ * ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో ఫంగస్ బాధితులు
Black Fungus: రోజూ లక్షల మంది కోవిడ్ బారిన పడి అల్లాడుతుంటే.. మరోవైపు వైరస్ దాడి నుంచి కోలుకున్న వారిలో కొందరు కొత్త జబ్బుకు గురికావడం ఆందోళన కల్గిస్తోంది. మ్యుకోర్‌మైకోసిస్ లేదా బ్లాక్ ఫంగస్ అనే ఈ వ్యాధి సీనియర్ డాక్టర్లను సైతం కలవరానికి గురి చేస్తోంది. ప్రస్తుతానికి ఢిల్లీ, మహారాష్ట్రతోపాటు గుజరాత్‌లలో కోవిడ్ నుంచి బయటపడిన రోగులు కొందరిలో ఈ బ్లాక్ ఫంగస్ కనిపిస్తున్నట్లు సమాచారం.
వాతావరణంలోనూ ఉండే మ్యుకోర్‌మైకోసిస్ గాలిద్వారా వ్యాపించే కోవిడ్-19తో సంబంధం ఉన్నట్లు సైంటిస్టులు చెబుతున్నారు. గత ఏడాది కోవిడ్-19 తొలి దశలోనే దీన్ని గుర్తించడం ద్వారా మందులతోనే ఈ సమస్యను అధిగమించవచ్చని వైద్యులు చెబుతున్నారు. కోవిడ్-19 నుండి కోలుకున్న వారికి సోకే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కిడ్నీసమస్య, కేన్సర్‌లతో కోవిడ్-19కి గురైతే సమస్య మరింత కష్టమవుతుంది.
మ్యుకోర్‌మైకోసిస్‌ను సకాలంలో గుర్తించకపోయినా.. అంధత్వం సంభవించవచ్చే లేదా ముక్కు, దవడ ఎముకలను తొలగించాల్సి రావచ్చు. ఒకానొక సమయంలో మృతి
చెందే అవకాశమూ ఉంటుంది. ఇక గుజరాత్‌లోని సూరత్ నగరంలో బ్లాక్‌ఫంగస్ బారిన పడ్డ సుమారు యాభై మందికి చికిత్స చేస్తుండగా ఇంకో అరవై మంది చికిత్స కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వ్యాధి బారిన పడ్డ వారిలో ఏడుగురు చూపు కోల్పోయినట్లు సమాచారం.