Black Fungus: షాకింగ్.. షాకింగ్..ఒకే రోగిలో బ్లాక్ ఫంగస్ అండ్ వైట్ ఫంగస్

Black Fungus: ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగ‌స్ కేసులు పెరిగిపోయాయి

Update: 2021-05-23 12:50 GMT

Representational Image

Black Fungus: క‌రోనా మ‌హ‌మ్మారి ఇంకా వ‌ద‌ల‌క ముందే.. బ్లాక్ ఫంగ‌స్ మ‌రో మ‌హ‌మ్మారి గురించి చెప్పి శాస్త్ర‌వేత్త‌లు బాంబు పెల్చారు. ఇంత‌లోనే బ్లాక్ ఒక‌టే అనుకుంటే వైట్ ఫంగ‌స్ ముప్పు కూడా ముంచుకొస్తుంద‌ని వెల్లడించారు. దీంతో జ‌నం ఒక్క‌సారిగా భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు. అయితే బ్లాక్ ఆండ్ వైట్ ఫంగ‌స్ లు ముప్పుడు ఎక్కుగా కరోనా నుంచి కోలుకునే క్రమంలో అధికంగా స్టెరాయిడ్స్ వినియోగించిన వారిలో వెలుగు చూస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అధికంగా స్టెరాయిడ్స్ వినియోగం వల్ల ఇమ్యూనిటీ పవర్ దెబ్బ తింటోందని దాంతోనే ఈ ఫంగస్ ప్రభావం చూపుతోందని అంటున్నారు

కరోనా నుంచి కోలుకున్న వారిని ఈ ఫంగస్ భయం కూడా వెంటాడుతోంది. ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగ‌స్ కేసులు పెరిగిపోయాయి. మ‌రో వైపు బీహార్ లో వైట్ ఫంగ‌స్ సోకిన వారిని గుర్తించారు. అయితే తాజాగా ఒకే వ్య‌క్తికి రెండు ఫంగ‌సులు సోక‌డం ఆశ్చ‌ర్యం క‌లిగింస్తుంది. ఇప్పటి వరకు ఒక వ్యక్తిలో ఒక ఫంగస్ గుర్తించడం సాధారణ విషయంగా ఉంది. కానీ.. ఒకే వ్యక్తిలో రెండు రకాల ఫంగస్ ను గుర్తించిన అరుదైన ఘటన తాజాగా వెలుగు చూసింది.

మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఓ రోగిలో బ్లాక్ ఫంగస్ తోపాటు వైట్ ఫంగస్ ఉండడాన్ని వైద్యులు గుర్తించినట్టు సమాచారం. దేశంలో ఈ తరహా కేసు నమోదవడం.. ఇదే మొదటి సారి కావడం గమనార్హం. అయితే.. ఆ తర్వాత భోపాల్ లో కూడా ఇలాంటి కేసు ఒకటి నమోదైందని తెలుస్తోంది. దీంతో రెండు ర‌కాల ఫంగ‌సులు సోకితే మ‌నిషికి ప్ర‌మాదం తీవ్ర‌స్థాయిలో ఉంటుంద‌ని వైద్యులు చెబుతున్నారు. మ‌రో్వైపు ప్ర‌భుత్వాలు కూడా క‌రోనా వైర‌స్ బారి నుంచి కోలుకున్న వారిలో స్టెరాయిడ్స్ వాడిన వారిని గుర్తించే ప‌నిలో ప‌డ్డాయి.

Tags:    

Similar News