BJP worker dies in Terrorists Attack: ఉగ్ర కాల్పుల్లో జమ్మూ బీజేపీ నేత మృతి
BJP worker dies in Terrorists Attack: జమ్మూకాశ్మీర్ లో దుండగుల కాల్పుల్లో గాయపడిన బీజేపీ నేత మృతిచెందాడు. రాష్ట్రంలోని బుద్గాం జిల్లాలో ఆదివారం ఉదయం బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ నజీర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.
BJP worker dies in Terrorists Attack: జమ్మూకాశ్మీర్ లో దుండగుల కాల్పుల్లో గాయపడిన బీజేపీ నేత మృతిచెందాడు. రాష్ట్రంలోని బుద్గాం జిల్లాలో ఆదివారం ఉదయం బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ నజీర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే హమీద్‌ను శ్రీనగర్‌లోని శ్రీ మహారాజ హరిసింగ్ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో సోమవారం తెల్లవారుజామున మరణించాడని హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి.
గత ఐదు రోజుల్లో రాష్ట్రంలోని ముగ్గురు బీజేపీ నేతలపై దాడులు జరిగాయి. రాష్ట్రంలో ఉగ్రవాద కార్యకలాపాలపై భద్రతాదళాలు ఉక్కుపాదం మోపుతున్నారు. దీంతో తీవ్రవాదులు బీజేపీ నేతలపై తరచూ దాడులకు పాల్పడుతున్నారు. తాజా కాల్పుల ఘటన తర్వాత... గత 24 గంటల్లో బీజేపీకి చెందిన 8 మంది తమ పదవులకు రాజీనామా చేశారు. ఓ బీజేపీ నేత.. ఇక తాను పార్టీ గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేననీ, దీనిపై ఎవరికైనా బాధ కలిగితే క్షమించండి అని సోషల్ మీడియా లో లెటర్ పెట్టారు. గత నెల రోజులుగా ఇలా 17 మంది బీజేపీ నాయకులు కాశ్మీర్ లో రాజీనామాలు చేశారు.