Nupur Sharma: ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు.. చర్చనీయాంశంగా నుపూర్‌ శర్మ

Nupur Sharma: ఢిల్లీలోనే చదువు.. లండన్‌లో మాస్టర్‌ డిగ్రీ

Update: 2022-06-06 12:00 GMT

Nupur Sharma: ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు.. చర్చనీయాంశంగా నుపూర్‌ శర్మ

Nupur Sharma: మొహమ్మద్‌ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత నూపుర్‌ శర్మ ఇప్పుడు చర్చనీయాంశంగా మారారు. ఇస్లాం మ‌త వ్య‌వ‌స్థాప‌కుడు ప్ర‌వ‌క్త‌పై ఓ టీవీ చ‌ర్చ‌లో ఆమె అనుచిత వ్యాఖ్య‌లు చేసి తీవ్ర వివాదాన్ని రేపారు. ఆమె వ్యాఖ్యలపై ఇస్లామిక్‌ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అటు బీజేపీ అధిష్ఠానం కూడా స్పందించింది. నూపుర్‌ శర్మను పార్టీ నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే అమె ఎవరు? ఎక్కడి వారు? అని జోరుగా చర్చ సాగుతోంది. వేసింది. నూపుర్ శ‌ర్మ ఢిల్లీవాసి. యూనివ‌ర్సిటీలోని హిందూ కాలేజీలో ఆర్థిక‌శాస్త్రంలో గ్రాడ్యుయేట్ అయ్యారు. ఢిల్లీ వ‌ర్సిటీ నుంచే ఆమె ఎల్ఎల్‌బీ చ‌దివారు. లండ‌న్ స్కూల్ ఆఫ్ ఎక‌నామిక్స్‌లో లా స‌బ్జెక్ట్‌లో నూపుర్‌ శర్మ మాస్ట‌ర్స్ డిగ్రీ చేశారు.

2008లో ఢిల్లీ యూనివ‌ర్సిటీ స్టూడెంట్స్ యూనియ‌న్ అధ్యక్షురాలిగా నూపుర్‌ శర్మ ఎన్నికయ్యారు. అయితే 2015లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ చీఫ్‌ కేజ్రీవాల్‌పై పోటీ చేసి నూపుర్‌ వార్తల్లో నిలిచారు. ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయినప్పటికీ పార్టీలో మాత్రం ఆమెకు ప్రాధాన్యం ఇచ్చింది. యువ మోర్చాలో వివిధ కీలక హోదాల్లో నూపుర్‌ శర్మ పని చేశారు. 2017లో ఢిల్లీ బీజేపీ అధికారి ప్ర‌తినిధిగా నియమితులయ్యారు. 2020 సెప్టెంబ‌రులో జేపీ న‌డ్డా బృందంలోకి నూపుర్‌ శర్మను తీసుకున్నారు. జాతీయ అధికార ప్ర‌తినిధిగా ఆమెను నియ‌మించారు. టీచ్ ఫ‌ర్ ఇండియా యూత్ అంబాసిడ‌ర్‌గా ఆమె కొన‌సాగుతున్నారు. తాజా వ్యాఖ్యలతో వాటన్నింటి నుంచి బీజేపీ అధిష్ఠానం తొలగించింది.

Tags:    

Similar News