BJP MLC Sunil Kumar Singh dies of Covid-19 : కరోనాతో బీజేపీ ఎమ్మెల్సీ మృతి
BJP MLC Sunil Kumar Singh dies of Covid-౧౯ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఎవరిని వదలడం లేదు. సామాన్య ప్రజల నుంచి రాజకీయ నాయకుల వరకు ఎవర్ని వదలడం లేదు. ఇప్పటికే అనేకమంది రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. ఇందులో చాలా వరకు కోలుకొని బయటపడగా, మరికొందరు మాత్రం మరణిస్తున్నారు. ఇటీవలే పశ్చిమ బెంగాల్ కు చెందిన ఎమ్మెల్యే తమోనాశ్ ఘోష్ కరోనా కారణంగా మరణించారు. కాగా, ఇప్పుడు బీహార్ కు చెందిన ఎమ్మెల్సీ సునీల్ సింగ్ కరోనాతో మృతి చెందారు.
కరోనా వైరస్ సోకడంతో ఎమ్మెల్సీ సునీల్ సింగ్ గత కొన్నిరోజులుగా పట్నాలోని ఎయిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన మంగళవారం రాత్రి గుండెపోటు రావడంతో మరణించారని హాస్పిటల్ అధికారులు ప్రకటించారు. ఎమ్మెల్సీ మరణంపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదేవిధంగా ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ ఎమ్మెల్సీ మృతిపై సంతాపం ప్రకటించారు.
భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 37,724 కేసులు నమోదు కాగా, 648 మంది ప్రాణాలు విడిచారు. దేశంలో మొత్తం 11,92,915 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4,11,113 ఉండగా, 7,53,049 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 28,732 మంది కరోనా వ్యాధితో మరణించారు.