Jharkhand assembly: జార్ఖండ్ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల ఆందోళనలు
* మత ప్రార్ధనలకు తమకూ రూమ్ కావాలంటూ ఆందోళనలు * బీజేపీ ఎమ్మెల్యేల డిమాండ్ తో స్తంభించిన అసెంబ్లీ
Jharkhand assembly: మత విశ్వాసాలను గౌరవించడంపై జార్ఖండ్ లో పెద్ద రచ్చ జరుగుతోంది.జార్ఖండ్ అసెంబ్లీ లో ముస్లింల నమాజ్ కోసం ప్రత్యేక రూమ్ కేటాయించడం వివాదానికి దారి తీసింది. తమకు హనుమాన్ చాలీసా పారాయణకు ప్రత్యేక గది కావాలంటూ బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. బీజేపీ ఎమ్మెల్యేలు ప్లకార్డులు పట్టుకుని తమకు కూడా ప్రార్ధనకు ప్రత్యేక గది కేటాయించాలంటూ పట్టుబట్టారు.
జార్ఖండ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాగానే బీజేపీ ఎమ్మెల్యేలు పోడింయలోకి దూసుకెళ్లి జై శ్రీరాం నినాదాలతో హోరెత్తించారు. ముస్లింలకు నమాజ్ రూమ్ కేటాయిస్తూ స్పీకర్ జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే సభ్యులు ఆందోళనలు కొనసాగించడంతో సభను వాయిదా వేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో అసలు ఆలయమే నిర్మించాలంటూ బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.