బెంగాల్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ.. నాలుగు రాష్ట్రాల్లో ఖాతా తెరవని కమలం పార్టీ...
BJP: సిట్టింగ్ సీటును కైవసం చేసుకున్న టీఎంసీ...
BJP: బెంగాల్‌లోని అసాన్ సోల్ పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో భారీ మెజారిటీతో ఈ సీటును కైవసం చేసుకున్న కమలం పార్టీ.. ఇప్పుడు రికార్డు ఓట్ల తేడాతో సిట్టింగ్ సీటును కోల్పోయింది. మరోవైపు బెంగాల్ సహా నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో కమలం పార్టీ ఖాతా తెరవలేదు. బీహార్ మినహా మిగిలిన రాష్ట్రాల్లో అధికార పార్టీల అభ్యర్థులే విజయం సాధించారు.
బెంగాల్‌లోని అసాన్‌సోల్ లోక సభ స్థానానికి జరిగిన ఎన్నికలో టీఎంసీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రముఖ నటుడు శతృఘన్ సిన్హా గెలుపొందారు. బాలీగంజ్ అసెంబ్లీ స్థానం నుంచి బాబుల్ సుప్రియో గెలుపొందారు. మహారాష్ట్రలోని కొల్హపూర్ ఉత్తర అసెంబ్లీ స్ధానానికి జరిగిన ఉప ఎన్నికలో మహా వికాస్ అఘాదీ తరపున కాంగ్రెస్ నేత జయశ్రీ జాదవ్ గెలుపొందారు. ఇక బీహార్ లోని బోచ్‌హా అసెంబ్లీ స్థానం నుండి ఆర్జేడీ అభ్యర్ధిగా అమర్ పాశ్వాన్ విజయం సాధించారు