Birds are Dying in the US: అంతు చిక్కని వ్యాధితో పక్షులు మృత్యువాత
Birds are Dying in the US: యావత్ ప్రపంచాన్ని వణికించిన కరోనా ఇపుడు పక్షులు, జంతువుల పాలిట పడినట్లు కనిపిస్తోంది.
Birds are Dying in the US: యావత్ ప్రపంచాన్ని వణికించిన కరోనా ఇపుడు పక్షులు, జంతువుల పాలిట పడినట్లు కనిపిస్తోంది. థర్డ్ వేవ్ తో వణికిపోతున్న అమెరికాలో తాజా పక్షులు, జంతువులు అంతు చిక్కని వ్యాధితో మరణిస్తున్నాయట. మరణించిన జంతువులు, పక్షులు కరోనా సోకి మరణిస్తున్నాయా అనేది ఇంకా తెలియలేదు. ఇదే గనుక నిజమయితే ప్రపంచమంతా జీవరాశులు మనుగడ ప్రశ్నార్థకమే. పూర్తి వివరాల్లోకి వెళితే...
గత సంవత్సరం మార్చి నుంచి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది కరోనా మహమ్మారి. మనుషులపైనే కాకుండా జంతువులకు కూడా ఈ వైరస్ సోకుతోంది. తాజాగా అమెరికాలో పక్షులు ఓ వింత వ్యాధితో మరణించడం జరుగుతోంది. అయితే ఇది దేని వల్ల అనేది మాత్రం స్పష్టంగా తెలియదు. మొదట 2021 ఏప్రిల్లో ఓ పక్షికి తన కను గుడ్డు ఉబ్బి, స్తాధీనం తప్పి ప్రాణాలను కోల్పోయినట్లు అక్కడి వైద్యులు గుర్తించారు. వ్యాధి ఏంటనేది మాత్రం ఇంత వరకు తెలియదు.పక్షులు ఇలా అంతుచిక్కని వ్యాధితో మరణించడం ఇంత వరకు చూడలేదని వాషింగ్టన్‌లోని జంతు సంరక్షణ కేంద్రం డైరెక్టర్ పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
జూన్‌లో పక్షుల మరణాలు పెరిగాయి. మొత్తం తొమ్మిది రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు వేల సంఖ్యలో నమోదయ్యాయి. కరోనా నుంచి మానవాళి ఇప్పుడిప్పుడే కోలుకొంటుండగా తాజాగా పక్షుల్లో కూడా ఓ మహమ్మారి మొదలైందని అనుమానిస్తున్నారు. పక్షులు ఇలా చనిపోవడం ఎన్నడూ చూడలేదని వాషింగ్టన్‌లోని జంతు సంరక్షణ కేంద్రం డైరెక్టర్ జిమ్ మోన్‌స్మా చెప్పారు. ఇప్పటికే కరోనా వైరస్ అనేది గాలిలో కలిసి పోయింది. ఇది పక్షలను కూడా వెంటాడుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే గనుక నిజమయితే ఇపుడున్న పరిస్థితులు మరోలా వుంటాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.