Bird flu: దేశంలో 4 రాష్ట్రాల్లో ప్రబలిన బర్డ్ ఫ్లూ
Bird flu: * రాజస్థాన్‌లో నేలరాలిన 425 కాకులు * ఇండోర్‌లోనూ చనిపోయిన 40 కాకులు * కేరళలో 12 వేలు, హిమాచల్‌లో 2400 బాతులు మృత్యువాత
దేశంలో బర్డ్‌ఫ్లూ మరోసారి పంజా విసురుతోంది. ఇప్పటికే రాజస్థాన్‌లో 425 కాకులు వైరస్ బారిన పడి మృతిచెందగా తాజాగా సోమవారం హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో కూడా కాకులు, బాతుల్లో బర్డ్‌ఫ్లూ నిర్ధారణ అయ్యింది. కరోనా కలవరం సద్దుమణగక ముందే కేరళపై బర్డ్‌ఫ్లూ వైరస్ దాడి చేసింది. ఈ వైర్‌సతో 12 వేల బాతులు మృతి చెందాయని, వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో మరో 36 వేల బాతులను చంపేయాల్సి రావచ్చని అధికారులు చెప్పారు.
హిమాచల్‌ప్రదేశ్‌లో కూడా ఈ వైరస్ కల్లోలం రేపుతోంది. ఏటా ఈ సీజన్‌లో వలస పక్షులు వస్తుంటాయి. గత నెల నుంచి ఇప్పటి వరకు దాదాపు 50 వేల పక్షలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. సోమవారం బయటపడ్డ బర్డ్‌ఫ్లూ కేసులు కూడా వలసపక్షుల్లో బయటపడడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మొత్తం 2,401 పక్షులు బర్డ్‌ఫ్లూ బారిన పడి చనిపోయాయని అధికారులు తెలిపారు.
మధ్యప్రదేశ్‌లో కూడా బర్డ్‌ఫ్లూ కలకలం నెలకొంది. ఇండోర్‌లో 50 కాకులు చనిపోయాయని, వాటి నమూనాలను ల్యాబ్‌కు పంపగా బర్డ్‌ఫ్లూ నిర్ధారణ అయ్యిందని అధికారులు వెల్లడించారు.