తొమ్మిదికి చేరిన రైలు ప్రమాద మృతులు.. స్పాట్‌ని పరిశీలించిన రైల్వే మంత్రి..

Guwahati-Bikaner Express: పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయ్‌గురిలో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది.

Update: 2022-01-14 06:34 GMT

తొమ్మిదికి చేరిన రైలు ప్రమాద మృతులు.. స్పాట్‌ని పరిశీలించిన రైల్వే మంత్రి..

Guwahati-Bikaner Express: పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయ్‌గురిలో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఈ ప్రమాదంలో 36 మంది గాయపడ్డారు. రాజస్థాన్‌లోని బికనీర్ నుంచి గువాహటికి వెళ్తున్న బికనీర్‌-గువాహటి ఎక్స్‌ప్రెస్‌ నిన్న సాయంత్రం పశ్చిమబెంగాల్‌ జల్పాయ్‌గురి జిల్లాలోని దొమోహనీ వద్ద పట్టాలు తప్పింది. రైలులోని 12 బోగీలు పట్టాలు తప్పగా, అందులో ఏడు బోగీలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో రైళ్లో మొత్తం 1053 మంది ప్రయాణికులు ఉన్నారు.

రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య తొమ్మిదికి పెరిగిందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. సహాయక చర్యలు పూర్తయ్యాయని చెప్పారు. ఘటనపై చట్టబద్ధమైన విచారణ ప్రారంభించామని కేంద్ర మంత్రి వెల్లడించారు. ప్రధాని మోడీ ఘటనపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రమాదంలో మృతిచెందినవారి కుటుంబాలకు రూ.5 లక్షలు నష్టపరిహారం ప్రకటించారు. తీవ్రంగా గాయపడినవారికి లక్ష, స్వల్ప గాయాలపాలైనవారికి రూ.25 వేల చొప్పున అందిస్తామని చెప్పారు.

Tags:    

Similar News