Bihar result: ఆర్జేడీ కొంప ముంచిన ఎల్‌జేపీ.. ఆధిక్యంలో మ్యాజిక్ ఫిగర్‌ను దాటిన ఎన్డీయే!

Bihar Result: ఆర్జేడీ ఓట్లను ఎల్‌జేపీ చీల్చేసింది. దీంతో బీహార్ లో స్పష్టమైన ఆధిక్యం దిశగా ఎన్డీయే పరుగులు తీస్తోంది. ఎన్నికల ఫలితాలపై వచ్చిన ఎగ్జిట్ పోల్స్ తల్లకిందులు అవుతున్నాయి బీహార్ లో!

Update: 2020-11-10 07:54 GMT

బీహార్‌లో నువ్వా నేనా అన్నట్టుగా ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. మొదట్లో దూకుడుగా ఆధిక్యంలోకి వచ్చినా ఆర్జేడీ తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తుంది. దీంతో ఎవరు గెలుస్తారని ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్‌ అన్ని తలకిందులుగా మారడంతో ఎవరు గెలుస్తారనేది ఆసక్తి నెలకొంది. రౌండ్ రౌండ్‌కి ఉత్కంఠ పెరుగుతోంది. మరోపక్కన ఫలితాలు రాకముందే పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. గెలిచే అవకాశం ఉన్న నేతలను ముందుగానే కాపాడుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు.

బీహార్‌లో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారుతున్నాయి. మొదటి నుంచి దూసుకుపోయిన తేజస్వీ యాదవ్ క్రమంగా తగ్గుతూ వస్తున్నారు. బీహార్‌లో జేడియూ కంటే బీజేపీనే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యత ఉంది. దాంతో సింగిల్ లార్జెస్ట్‌ పార్టీగా మొదటి సారి బీజేపీ రానుంది. దాంతో బీహార్‌లో అతిపెద్ద పార్టీగా బీజేపీ ఉంది ఇప్పటి వరకు బీజేపీ 70 స్థానాల్లో ముందంజలో ఉంది.

అయితే.. మరోవైపు చిరాగ్ పాశ్వాన్‌ నేతృత్వంలోని ఎల్‌జేపీ ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా మారనుంది. చిరాగ్ ద్వారా పావులు కదిపిన బీజేపీ వ్యూహం ఫలించింది. ఎల్పీజీ ని విడిగా పోటీ చేయించడం ద్వారా బీజేపీ ప్లాన్ బాగా వర్కౌట్ అయినట్టు తెలుస్తోంది. మరోవైపు సీఎం పదవిని ఆశపడిన తేజస్వీ యాదవ్ కల కలగానే మిగిలేలా కనిపిస్తోంది. మరోవైపు బీహార్‌లో ఎగ్జిట్ పోల్స్ అన్నీ తలకిందులుగా మారాయి. ఊహించినట్టుగా కాకుండా భారీ స్థాయిలో తేడాలు కనిపిస్తున్నాయి.

ఆర్జేడీ హవా తగ్గింది. మొదట్లో వందకు పైగా స్థానాల్లో ఆధిక్యతను సాధించిన ఆర్జేడీ ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వందలోపు ఆగిపోయింది. మైనారిటీ జేడియూకు బీజేపీ మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. 60 స్థానాల్లో వెయ్యి కంటే తక్కువ మోజారిటీతో అభ్యర్థుల మధ్య పోటీ కొనసాగుతోంది.

Tags:    

Similar News