కరోనా కాటుకు బలైన మంత్రి!

కరోనా మహమ్మారి కారణంగా చికిత్స పొందుతూ.. బీజేపీ నాయకుడు, మంత్రి వినోద్ కుమార్ సింగ్ (50) మరణించారు. ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స..

Update: 2020-10-12 12:07 GMT

కరోనా మహమ్మారి కారణంగా చికిత్స పొందుతూ.. బీజేపీ నాయకుడు, మంత్రి వినోద్ కుమార్ సింగ్ (50) మరణించారు. ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం ఉదయం కన్నుమూశారు.. మంగళవారం వినోద్ కుమార్ సింగ్ మృతదేహాన్ని పాట్నాకు తరలించనున్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని మంత్రివర్గంలో ఆయన బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ పదవిని నిర్వహించారు. ఆగస్టు 16న మంత్రికి రక్తస్రావం జరిగింది, ఆ తర్వాత పాట్నాలోని ఆసుపత్రిలో చేరారు. అక్కడి నుంచి ఎయిర్ అంబులెన్స్ ద్వారా చికిత్స కోసం ఢిల్లీకి పంపారు. అంతకంటే ముందు జూన్ నెలలో సింగ్ కు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది.

దాంతో ఆసుపత్రిలోని సెల్ఫ్ ఐసోలేషన్ వార్డులో ఉన్నారు. కొద్దిరోజుల తరువాత కోలుకోవడంతో మళ్ళీ అనారోగ్యం భారిన పడి చివరకు తుదిశ్వాస విడిచారు. వినోద్ కుమార్ మరణం పట్ల ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వినోద్ కుమార్ కుటుంబ సభ్యులకు నితీష్ కుమార్ కుమార్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన మరణం తీరని లోటని పేర్కొన్నారు. మంత్రి అంత్యక్రియలను అధికారికంగా నిర్వహిస్తామని చెప్పారు. ఇదిలావుంటే బీహార్ కే చెందిన కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కూడా ఇటీవల మరణించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News