రాబోయే ఎన్నికలకు ఎన్డీఏ పొత్తు ఖరారు.. సీట్ల సర్దుబాటుపై చర్చ

నిన్న మొన్నటివరకు పొత్తు ఉంటుందా? ఉండదా.. ఉంటే ఎవరెన్ని సీట్లలో పోటీ చేస్తారు.. కొద్దిరోజులుగా ఇదే చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో..

Update: 2020-09-13 02:07 GMT

నిన్న మొన్నటివరకు పొత్తు ఉంటుందా? ఉండదా.. ఉంటే ఎవరెన్ని సీట్లలో పోటీ చేస్తారు.. బీహార్ లో కొద్దిరోజులుగా ఇదే చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ, బీజేపీ పొత్తును కంటిన్యూ చెయ్యాలని నిర్ణయించాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీచేసే విధంగా వ్యూహాలను రచించడానికి.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్ తో భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య రెండుగంటల పాటు చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సీట్ల పంపకంపై చర్చించారు. ప్రధానంగా జేడీయూ, బీజేపీ ఎన్నెసీ సీట్లను పంచుకోవాలి అనే దానిపైనే చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అయితే మాజీ ముఖ్యమంత్రి జీతన్ రాయ్ మాంజీ పార్టీ మాత్రం తమకు 20 సీట్లు కావాలని అడుగుతోంది.

కానీ జేడీయూ మాత్రం 6 సీట్లు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించింది. దీనిపై ఇవాళో రేపో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇదిలావుంటే రాంవిలాస్‌ పాశ్వాన్‌ నేతృత్యంలోని ఎల్‌జేపీ పార్టీ జేడీయూ నిర్ణయాలను తీవ్రంగా విభేదిస్తూ, ఆ పార్టీతో కలిసి పోటీచేయలేమని ప్రకటించింది. దీంతో జేపీ నడ్డా చొరవ తీసుకొని సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎల్‌జేపీ కూడా 20 కి పైగా అసెంబ్లీ టిక్కెట్లు డిమాండ్ చేస్తోంది. ఇదిలావుంటే జార్ఖండ్‌ ముఖ్యమంత్రి, జేఎంఎం అధ్యక్షుడు హేమంత్‌ సోరేన్‌ ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌తో భేటీ అయ్యారు. ఎన్నికల్లో ఆర్జేడీ పార్టీతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. అయితే 12 సీట్లు కావాలని జేఎంఎం డిమాండ్ చేస్తుండగా ఆర్జేడీ మాత్రం మూడు మాత్రమే ఇస్తామని తేల్చి చెప్పింది.

Tags:    

Similar News