CM Nitish Kumar: ప్రశాంత్ కిషోర్‌పై నితీశ్ కుమార్ వ్యంగ్యాస్రాలు..

CM Nitish Kumar: బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ మళ్లీ బీజేపీలో చేరుతారని ప్రశాంత్‌ కిషోర్‌ చేసిన వ్యాఖ్యలకు నితీష్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు

Update: 2022-10-22 01:52 GMT

CM Nitish Kumar: ప్రశాంత్ కిషోర్‌పై నితీశ్ కుమార్ వ్యంగ్యాస్రాలు..

CM Nitish Kumar: బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ మళ్లీ బీజేపీలో చేరుతారని ప్రశాంత్‌ కిషోర్‌ చేసిన వ్యాఖ్యలకు నితీష్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. పీకే మంచి వయసు మీద ఉన్నాడంటూ వ్యంగ్యంగా సెటైర్లు వేశారు. పీకే తన పబ్లిసిటీ కోసం ఏదైనా మాట్లాడతారన్న నితీష్.. ఆయన తన ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేసుకోవచ్చనీ.. అలాంటి వాటిపై తాను స్పందించాల్సిన అవసరం లేదన్నారు. అయితే, ఒకప్పుడు పీకే అంటే తనకు మంచి గౌరవం ఉండేదన్నారు. తాను అతడికి గౌరవం ఇచ్చినా అతడు మాత్రం తనను అగౌరవ పర్చాడని విమర్శించారు. ఆయనకు రాజకీయ ఆరోపణలు చేయడం అలవాటే అన్న నితీష్ కుమార్.. పీకే చేసిన తాజా వ్యాఖ్యల్లో అర్ధం లేదని విమర్శించారు.  

Tags:    

Similar News