బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చివరి దశ పోలింగ్!

Bihar Assembly Elections: * మూడో విడతలో 19 జిల్లాల్లో 78 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ * బరిలో 1,204 మంది అభ్యర్థులు * ఓటు హక్కు వినియోగించుకోనున్న 2.34 కోట్ల మంది * ఈ నెల 10న బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలుదశ పోలింగ్

Update: 2020-11-07 04:28 GMT

Bihar elections (file Photo)


బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో చివరి దశ పోలింగ్ కొనసాగుతోంది. 19 జిల్లాల్లోని 78 అసెంబ్లీ స్థానాలకు మూడవ దశ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. 78 నియోజకవర్గాల్లో 1204 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 2కోట్ల 34 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

బీహార్ మూడో దశ ఎన్నికల్లో బరిలో దిగిన వారిలో అసెంబ్లీ స్పీకర్‌తో పాటు ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ మంత్రి వర్గంలోని 12 మంది మంత్రులు ఉన్నారు. ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు రెండు విడతల్లో 165 స్థానాలకు పోలింగ్‌ పూర్తికాగా.. ఈ నెల 10న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

వాల్మీకి నగర్ ఉప ఎన్నిక కూడా..

78 అసెంబ్లీ స్థానాలతో పాటుగా వాల్మీకినగర్‌ లోక్‌సభ నియోజకవర్గం స్థానానికి ఉపఎన్నిక జరుగుతుంది. సిట్టింగ్‌ జేడీ(యూ) ఎంపీ బైద్యనాథ్‌ మహతా మృతితో ఈ స్థానానికి ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది. కోసి-సీమాంచల్ ప్రాంతంలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో ముస్లిం ఓటర్లు విజయావకాశాలను ప్రభావితం చేస్తారు. అసదుద్దీన్ ఒవైసీ తన పార్టీ అభ్యర్థులను రంగంలోకి దింపడంతో పోరు రసవత్తరంగా మారింది. ఎంఐఎం అభ్యర్థుల తరఫున ఒవైసీ ముమ్మరంగా ప్రచారం చేశారు. దీని వల్ల ఎవరికి మేలు జరుగుతుందో మరో మూడు రోజుల్లో తేలిపోనుంది.

బీహార్ తొలి దశలో 71 స్థానాలకు అక్టోబరు 28న పోలింగ్ నిర్వహించగా.. దాదాపు 56 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. రెండో దశలో 94 స్థానాలకు పోలింగ్ జరగ్గా 55.70 శాతం ఓటింగ్ నమోదయ్యింది. ఇవాళ జరుగుతున్న మూడో దశ పోలింగ్ ముగిసిన తర్వాత.. ఓట్ల లెక్కింపు నవంబరు 10న జరగనుంది.




Tags:    

Similar News