నవంబర్ 29 లోపు బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు

అసెంబ్లీ ఎన్నికలతో పాటు బీహార్‌లోని ఒక పార్లమెంటరీ, 64 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతాయని..

Update: 2020-09-04 10:45 GMT

అసెంబ్లీ ఎన్నికలతో పాటు బీహార్‌లోని ఒక పార్లమెంటరీ, 64 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతాయని భారత ఎన్నికల సంఘం తెలిపింది. బీహార్‌లో జరగబోయే ఎన్నికలపై ఈసీ శుక్రవారం స్పందించింది. ఎన్నికలు నవంబర్ 29 లోపు నిర్వహించే అవకాశం ఉందని ఈసీ పేర్కొంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా ఇంతకు ముందే చెప్పారు. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని. వివి

ప్యాడ్ లతోపాటు అదనపు సంఖ్యలో ఈవీఎంలు ఏర్పాటు చేస్తామని ఈసీ తెలిపింది. కాగా ఇప్పటినుంచే రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో సకాలంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన సన్నాహాలు జరుగుతున్నాయి. ఓటర్ల ఆరోగ్యం, ఎన్నికల నిర్వహణలో సిబ్బంది ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా కోవిడ్ -19 మహమ్మారి మధ్య సాధారణ మరియు ఉప ఎన్నికలను నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ గత నెలలో వివరణాత్మక ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని (ఎస్ఓపి) జారీ చేసింది.  

Tags:    

Similar News