బీహార్ లో 53.4శాతం పోలింగ్..
బీహార్ లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తొలి దశ పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6గంటల వరకు 53.4శాతం పోలింగ్ నమోదైంది. 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్ లో తొలి విడతలో 6 జిల్లాలోని 71 స్థానాలలో పోలింగ్ నిర్వహించారు.
బీహార్ లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తొలి దశ పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6గంటల వరకు 53.4శాతం పోలింగ్ నమోదైంది. 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్ లో తొలి విడతలో 6 జిల్లాలోని 71 స్థానాలలో పోలింగ్ నిర్వహించారు. ఇందుకోసం 1066 మంది అభ్యర్థులు పోటిపడుతున్నారు. ఇక తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసినప్పటికి కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మోరాయించాయి. కొవిడ్ నిబంధనల నేపథ్యంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాలను శానిటైజ్ చేశారు. కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని చెప్పినప్పటికీ చాలా మంది మాస్క్‌లు లేకుండానే ఓటు వేసేందుకు వచ్చారు. ఇక అటు నవంబర్ 3న రెండో విడుతలో 94 నియోజకవర్గాలలో, నవంబర్ 7న మూడో విడుతలో 78 నియోజకవర్గాలలో పోలింగ్ జరగనుంది. ఇక 2015లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 54.94శాతం పోలింగ్ నమోదు కాగా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో 53.54శాతం నమోదు అయింది.