New Education Policy: విద్యావ్యవస్థలో పలుమార్పులు చేపడుతోన్న కేంద్రం.. ఇక నుంచి బోర్డు ఎగ్జామ్ రెండుసార్లు రాసే ఛాన్స్..!

New Education Policy: విద్యార్థులకు బోర్డ్ ఎగ్జామ్స్ సంవత్సరానికి ఎన్నిసార్లు ఉంటాయి? అంటే ఒకేసారి అని ఇప్పటివరకు చెప్పుకుంటున్నాం.

Update: 2023-08-24 07:15 GMT

New Education Policy: విద్యావ్యవస్థలో పలుమార్పులు చేపడుతోన్న కేంద్రం.. ఇక నుంచి బోర్డు ఎగ్జామ్ రెండుసార్లు రాసే ఛాన్స్..!

New Education Policy: విద్యార్థులకు బోర్డ్ ఎగ్జామ్స్ సంవత్సరానికి ఎన్నిసార్లు ఉంటాయి? అంటే ఒకేసారి అని ఇప్పటివరకు చెప్పుకుంటున్నాం. త్వరలో ఈ ప్రశ్నకు రెండు సార్లు అని సమాధానం చెప్పే రోజులు రానున్నాయి. న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి అనుగుణంగా కేంద్రప్రభుత్వం విద్యా వ్యవస్థలో పలు మార్పులు చేపడుతోంది. సంవత్సరంలో బోర్డు పరీక్షలను రెండు సార్లు నిర్వహించాలని నేషనల్‌ కరికులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌ను కేంద్ర విద్యా శాఖ రూపొందించింది. ఈ మేరకు బుధవారం విద్యా శాఖ ప్రకటన చేసింది. ఎన్‌ఈపీకి తగినట్లుగా 2024 అకడమిక్‌ ఇయర్ కోసం కొత్త పాఠ్యపుస్తకాలను రూపొందిస్తామని తెలిపింది. అలాగే 11, 12 తరగతుల విద్యార్థులు రెండు లాంగ్వేజ్‌ సబ్జెక్ట్స్‌ను చదవాలని, అందులో ఒకటి కచ్చితంగా భారతీయ భాష అయ్యి ఉండాలని వెల్లడించింది.

విద్యార్థులు ఏడాదికి రెండుసార్లు బోర్డ్ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. అంతేకాదు, పరీక్షల విధానంలో ఎన్నో మార్పులు చోటుచేసుకోనున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన విద్యా విధానం ద్వారా ఈ మార్పులు జరగనున్నాయి. విద్యార్థులపై మానసిక ఒత్తిడి తగ్గేలా పాఠ్య ప్రణాళికలను కూడా రూపొందిస్తున్నామని కేంద్ర విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. అలాగే, విద్యార్థులు అధిక మార్కులు సాధించేలా ఈ విధానం ఉంటుందని వివరించింది. బోర్డు పరీక్షలను మరింత సులభతరం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గడమే కాకుండా వారు స్కోరు పెంచుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. పాఠాలు బట్టీ పట్టడం, నెలల తరబడి కోచింగ్‌ల అవసరం లేకుండా విద్యార్థుల అవగాహన సామర్థ్యం అంచనా వేసేలా పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది.

విద్యార్థులకు బోర్డు పరీక్షలు సంవత్సరానికి రెండు సార్లు నిర్వహించాలని, అందులో బెస్ట్‌ స్కోర్‌ను వారు తీసుకోవడానికి అనుమతి ఉంటుందని కేంద్ర విద్యా శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న దానికంటే పాఠాశాల బోర్డులు నిర్ణీత సమయంలో ఆన్‌ డిమాండ్‌ పరీక్షలను అందించేందుకు తగిన సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవాలని న్యూ కరిక్యులమ్‌ ఫ్రేమ్‌ వర్క్‌లో వెల్లడించారు. అలాగే బోర్డు ఎగ్జామ్‌ టెస్ట్‌ డెవలపర్స్‌, ఎవాల్యుయేటర్స్‌ కూడా యూనివర్సిటీలు సర్టిఫై చేసిన కోర్సులను పూర్తి చేయాలని తెలిపారు. కొత్త కరిక్యులమ్‌ ఫ్రేమ్‌ వర్క్‌ ప్రకారం.. విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచేందుకు అవకాశం ఉండేలా తగినంత సమయం ఉంటుందని, సంవత్సరానికి కనీసం రెండు సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించడం వల్ల వారికి మంచి అవకాశం దొరుకుతుందని విద్యాశాఖ పేర్కొంది.

రెండు సార్లు నిర్వహించడం వల్ల విద్యార్థులు తాము సిద్ధంగా ఉన్నామని భావించినప్పుడు పరీక్షలకు హాజరు కావొచ్చని, రెండింటిలో ఉత్తమ స్కోర్‌ను తీసుకోవడానికి పర్మిషన్ ఉంటుందని చెప్పారు. 11, 12 తరగతుల విద్యార్థులకు రెండు భాషలు తప్పనిసరి అని NCERT జాతీయ పాఠ్యప్రణాళిక స్పష్టం చేసింది. ఈ మేరకు NCERT బుధవారం తుది జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్‌వర్క్‌ విడుదల చేసింది. నూతన కరిక్యులమ్ ఫ్రేమ్ వర్క్ బోర్డు పరీక్షలను సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించాలని సిఫారసు చేసింది. సైన్స్‌, కామర్స్‌ వంటి స్ట్రీమ్‌లలోని సబ్జెక్టులను విద్యార్థులు ఎంచుకోవడానికి ఎటువంటి పరిమితి ఉండకూడదని తెలిపింది.

Tags:    

Similar News