నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలకు ఊహించని మద్ధతు లభించింది. రైతుల సమస్యల పరిష్కారానికి సుప్రీం కోర్టు నియమించిన కమిటీ నుంచి భారతీయ కిసాన్ సంఘం (బీకేయూ) అధ్యక్షుడు భూపేందర్‌సింగ్ మాన్ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. రైతుల ప్రయోజనాల కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని భూపేందర్‌సింగ్ మాన్ వ్యాఖ్యానించారు. కమిటీ నియమించి మూడు రోజులైనా కాకముందే భూపేందర్‌సింగ్ కమిటీ నుంచి తప్పుకోవడం సంచలనం కలిగిస్తోంది. ఈ కమిటీలో సభ్యుడిగా నామినేట్ చేసినందుకు సర్వోన్నత న్యాయస్థానికి కృతజ్ఞతలు తెలిపిన మాన్.. రైతుల ప్రయోజనాలతో రాజీపడే ప్రసక్తే లేదని, ఎలాంటి పదవినైనా త్యాగం చేస్తానని స్పష్టంచేశారు.