ఐఏఎస్ అధికారిణితో ఎమ్మెల్యే పెళ్లి.. 80 గ్రామాల నుంచి 3 లక్షల మందికి ఆహ్వానం

MLA Weds IAS: డిసెంబరు 22న పెళ్లి... మూడు చోట్ల రిసెప్షన్

Update: 2023-12-09 05:18 GMT

ఐఏఎస్ అధికారిణితో ఎమ్మెల్యే పెళ్లి.. 80 గ్రామాల నుంచి 3 లక్షల మందికి ఆహ్వానం

MLA Weds IAS: హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ మనవడు, ప్రస్తుత ఎమ్మెల్యే భవ్య బిష్ణోయ్.. ఒక ఐఏఎస్‌ అధికారిణిని వివాహం చేసుకోబోతున్నారు. డిసెంబర్ 22న వీరి పెళ్లి జరగనుంది. విషయం ఇక్కడ వరకే ఉంటే.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేమీ ఉండదు. కానీ ఈ వివాహానికి ఢిల్లీతో సహా రెండు రాష్ట్రాలకు ఆహ్వానాలు వెళ్లాయి. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో వివాహం జరుగుతుండగా.. పుష్కర్, అదంపుర్‌, డిల్లీ నగరాలు మూడు రిసెప్షన్‌లకు వేదిక కానున్నాయి. ఈ వేడుకల నిమిత్తం మూడు లక్షల మందికి ఆహ్వానాలు వెళ్లనున్నాయి. దీంతో ఇప్పుడు ఈ వివాహం చర్చనీయాంశంగా మారింది.

 పెళ్లి కుమార్తె విషయానికి వస్తే ఆమె 2019లో సివిల్స్ సాధించారు. ఆమెది రాజస్థాన్. ప్రస్తుతం సిక్కిం కేడర్ కింద గ్యాంగ్ టక్ లో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిద్దరి ఎంగేజ్ మెంట్ ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగింది. అప్పుడే వీరి వ్యవహారం దేశ వ్యాప్తంగా పలువురిని ఆకర్షించింది. తాజాగా వీరి పెళ్లికి ముహుర్తం డిసైడ్ చేసేశారు. డిసెంబరు 22న వీరి పెళ్లి జరగనుంది. ఈ మొత్తం వేడుకలకు కలిపి దగ్గరదగ్గర మూడు లక్షల మంది కనీసం హాజరవుతారన్నది అంచనా. పెళ్లి అనంతరం రాజస్థాన్ లోని పుష్కర్ సిటీలో ఒక రిసెప్షన్ ను నిర్వహిస్తారు.

పెళ్లి కుమారుడి తాత కాలం నుంచి ఈ ప్రాంతంలో పట్టు ఉంది. ఈ నియోజకవర్గం పరిధిలోని 80 గ్రామాలకు పైగా ప్రజలను ఈ పెళ్లి వేడుకకు పిలుస్తున్నారు. భవ్య బిష్ణోయ్ గురించి మరో ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాలి. నిజానికి.. ఇతగాడి పెళ్లి మొదట్లో సినీ నటి మెహ్రీన్ తో అనుకున్నారు. ఇందులో భాగంగా ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. అయితే.. అనంతరం వీరి పెళ్లి రద్దైంది. ఇరువురు బ్రేకప్ చెప్పుకున్నారు. కట్ చేస్తే.. తాజాగా ఐఏఎస్ అధికారిణితో పెళ్లి జరగనుంది.

Tags:    

Similar News