కరోనా వ్యాక్సిన్‌పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా టీకా అత్యవసర వినియోగానికి కేంద్రం నిరాకరించింది. కరోనా వ్యాక్సిన్‌ను తయారుచేసిన సీరమ్, భారత్ బయోటెక్ సంస్థలు అత్యవసర వినియోగానికి అనుమతివ్వాలంటూ కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నాయి. అయితే, సీరమ్, భారత్ బయోటెక్ దరఖాస్తులను కేంద్రం తిరస్కరించింది. వ్యాక్సిన్ భద్రత, సామర్ధ్యంపై సరైన డేటా లేదన్న కేంద్రం సీరమ్, భారత్ బయోటెక్ కంపెనీల అభ్యర్ధనను నిరాకరించింది. నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.