Covaxin Production in Gujarat: గుజరాత్‌లోనూ కోవాగ్జిన్ టీకా ఉత్పత్తి

Covaxin Production in Gujarat: భారత్ బయోటెక్ ఇకపై గుజరాత్ లోనూ ఉత్పత్తి చేసేందుకు సిద్ధమవుతోంది.

Update: 2021-05-21 01:07 GMT

Covaxin Production 

Covaxin Production in Gujarat: వ్యాక్సినేషన్ వేగం పెంచే దిశగా భారత్ బయోటెక్ అడుగులు వేస్తోంది. డిమాండ్ కు తగ్గట్టుగా సప్లై చేసేందుకు ఉత్పత్తిని పెంచుతోంది. కేంద్రంతో అవగాహనతో అనుగుణంగా ఉత్పత్తి కేంద్రాలనూ పెంచుతోంది. ఇప్పటికే కొవాగ్జిన్ ను హైదరాబాదు, బెంగళూరు నగరాల్లో మాత్రమే ఉత్పత్తి చేస్తున్న భారత్ బయోటెక్ ఇకపై గుజరాత్ లోనూ ఉత్పత్తి చేసేందుకు సిద్ధమవుతోంది. అంక్లేశ్వర్ లోని చిరోన్ బెహ్రింగ్ వ్యాక్సిన్ కేంద్రంలోనూ కొవాగ్జిన్ డోసులు ఉత్పత్తి చేయనున్నట్టు భారత్ బయోటెక్ ఓ ప్రకటనలో తెలిపింది.

అంక్లేశ్వర్ లోని వ్యాక్సిన్ కేంద్రం నుంచి ఈ ఏడాది నాలుగో త్రైమాసికం నాటికి ఉత్పత్తి ప్రారంభం కానుంది. కొవాగ్జిన్ టీకా ప్రత్యేకత కారణంగా దీన్ని ఉత్పత్తి చేయడానికి బీఎస్ఎల్-3 ప్రమాణాలు ఉన్న ల్యాబ్ లు అవసరం అవుతాయి. కాగా, తమ వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రాల సంఖ్య మూడుకు పెరిగిన నేపథ్యంలో, ఏడాదికి వంద కోట్ల డోసులు ఉత్పత్తి సాధ్యమేనని భారత్ బయోటెక్ భావిస్తోంది.

Tags:    

Similar News