Corona Vaccine: వాగ్జిన్ మూడో దశ ట్రయల్స్‌పై భారత బయోటెక్ కీలక ప్రకటన
Corona Vaccine: కొవాగ్జిన్ 80.06శాతం సమర్థవంగా పని చేస్తోంది-భారత్ బయోటెక్
Corona Vaccine: మూడోదశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను భారత్ బయోటెక్ సంస్థ ప్రకటించింది. కొవాగ్జిన్ 80.06శాతం సమర్థవంగా పని చేస్తున్నట్లు తెలిపింది. 25,800 మందిపై కొవాగ్జిన్ టీకా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించగా, వారిపై టీకా సమర్థవంతంగా పని చేసిందని భారత్ బయోటెక్ సంస్థ పేర్కొంది. ఆ మేరకు సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే భారత్ బయోటెక్ సంస్థకు సంబంధించిన కొవాగ్జిన్ టీకాను దేశ ప్రజలందరికీ అందిస్తోంది.
రెండు దశల ట్రయల్స్‌కు సంబంధించి కొవాగ్జిన్ పనితీరు మెరుగ్గా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం.. భారత్ బయోటెక్ రూపొందించిన ఈ టీకాను అత్యవసర వినియోగం కింద వినియోగించవచ్చు అంటూ కేంద్ర వైద్యఆరోగ్యశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, అప్పటికి మూడో దశ ట్రయల్స్ ఫలితాలు ఇంకా వెల్లడి కాలేదు. దాంతో మూడో దశ ట్రయల్స్ ఫలితాలు రాకుండానే కేంద్ర ప్రభుత్వం ఈ టీకాకు అనుమతి ఇవ్వడం పట్ల దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. టీకా సమర్థతపై అనేక అనుమానాలు రేకెత్తించారు. ఫలితంగా కొవాగ్జిన్ టీకా సమర్థతపై అనుమానంతో చాలా మంది ఆ టీకాను వేసుకునేందుకు వెనుకడుగు వేశారు.
ఇక తాజాగా మూడో దశ ట్రయల్స్ ఫలితాలు కూడా విడుదలవడంతో భారత్ బయోటెక్ సంస్థకు సంపూర్ణంగా లైన్ క్లియర్ అయినట్లైంది. టీకా ప్రభావం కూడా ఘననీయంగా ఉండటంతో.. కొవాగ్జిన్ వినియోగం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.