Karnataka Election: కర్నాటక ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్.. గెలుపెవరిది..?
Karnataka Election: రెండు ప్రధాన పార్టీలపై రూ.కోట్లల్లో బెట్టింగ్స్
Karnataka Election: కన్నడనాట జెండా పాతేదెవరు..? కమలనాథులు రెండో సారి పవర్‌లోకి వస్తారా..? హస్తం పార్టీ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటుందా..? ప్రభుత్వ ఏర్పాటులో JDS కింగ్ మేకర్ అవుతుందా..? సార్వత్రిక ఎన్నికలకు ముందు సైమీ ఫైనల్స్‌గా భావిస్తున్న కర్ణాటక దంగల్‌లో గెలిచి నిలిచేదెవరు..?
కర్ణాటక ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈవీఎంలలో నిక్షిప్తమైన నేతల భవిష్యత్తు రేపు తేలనుంది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఏ పార్టీకి కూడా పూర్తి మెజార్టీ ఇవ్వలేదు. కానీ..కాంగ్రెస్ పార్టీ ఈ సారి అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని అంచనా వేశాయి. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 113 సీట్లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో...మళ్లీ హంగ్ ఏర్పడే అవకాశముంది. జేడీఎస్‌కు 20 నుంచి 30 సీట్లు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో..ఎప్పటి మాదిరిగానే కుమార స్వామి పార్టీ కింగ్ మేకర్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే గెలుపుపై ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ సారి కూడా తామే అధికారంలో వస్తామంటున్నారు కమలనాథులు.
మరోవైపు హస్తం పార్టీ నేతలు కూడా ఫుల్ కాన్ఫిడెన్స్‌గా ఉన్నారు. ఇప్పటికే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎగ్జిట్ పోల్స్ తేల్చిన నేపథ్యంలో.. ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటున్నారు డీకే శివకుమార్ అండ్ టీం.. ఇక కన్నడ నాట ఫలితాలకు ముందే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జేడీఎస్ అధినేత కమారస్వామి సింగపూర్‌కు వెళ్లారు. దీంతో కుమారస్వామి సింగపూర్ టూర్ పై ఒక్కసారిగా ఊహాగానాలు ఊపందుకున్నాయి.
మరోవైపు కన్నడ ఫలితాలపై జోరుగా బెట్టింగ్స్ నడుస్తున్నాయి. హంగ్ తప్పదని ఎగ్జిట్‌పోల్స్‌లో తేలడంతో..బెట్టింగ్స్ మరింత ఊపందుకున్నాయి.. సిగ్మెంట్‌ల వారీగా..రెండు ప్రధాన పార్టీలపై కోట్లల్లో బెట్టింగ్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.