బెంగళూరు రేవ్ పార్టీ కేసులో విచారణ వేగవంతం .. బయటపడుతున్న పొలిటికల్ నేతలు, ప్రముఖులతో లింకులు

మరికొందరి అరెస్ట్‌కు రంగం సిద్ధం చేసిన పోలీసులు

Update: 2024-05-26 08:14 GMT

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో విచారణ వేగవంతం .. బయటపడుతున్న పొలిటికల్ నేతలు, ప్రముఖులతో లింకులు

Bengaluru Rave Party: బెంగళూరు రేవు పార్టీ కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. ఈ కేసులో ఆధారాలతో తీగ లాగితే.. డొంక కదులుతోంది. రేవ్ పార్టీలో పొలిటికల్ లీడర్లు.. ప్రముఖులకు లింకులు ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఏపీ మంత్రి కాకాని పేరుతో ఉణ్న స్టిక్కర్ ఉన్న కారు ఉండటంతో.. మంత్రి అనుచరుడు పూర్ణారెడ్డి బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. రేవ్ పార్టీ ఏర్పాటులో ఆ‍యన ప్రముఖ పాత్ర పోషించారని.. పోలీసులు ధృవీకరించారు. వీరితో పాటు ప్రధాన నిందితుడు వాసుతో సహా ఇప్పటివరకు ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అనుచరుడు అరుణ్ కుమార్ అరెస్ట్ చేశారు పోలీసులు. అతని మొబైల్ ఫోన్ ఆధారంగా దర్యాప్తు సాగిస్తున్నట్లు వెల్లడించారు.నటి హేమ సహా 8 మందికి విచారణ నోటీసులు జారీ చేశారు సీసీబీ పోలీసులు. రేపు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.

కాగా.. రేవ్ పార్టీలో మొత్తం 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు వైద్య పరీక్షలో నిర్ధారణ అయ్యింది. అందులో 56 మంది పురుషులు ఉండగా.. 27 మంది యువతులు ఉన్నట్టు సీసీబీ పోలీసులు గుర్తించారు. 14.40 గ్రాముల MDMA పౌడర్, 1.16 MDMA క్రిస్టల్స్, 6 గ్రాముల హైడ్రోక్యాన్బీస్, 5 గ్రాముల కోకైన్, 6 గ్రాముల హైడ్రో గంజాయి, వాటిని పీల్చడానికి 500 రూపాయల నోటును పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News