లవ్ @ ట్రాఫిక్ జామ్.. ట్రాఫిక్ వల్లే తన లవ్ సెట్ అయ్యిందన్న..
Bengaluru: ప్రేమ.. అదో అందమైన అనుభూతి. ఇద్దరి మధ్య చిగురించి వాళ్లను ఒక్కటి చేసేది ప్రేమ.
Bengaluru: ప్రేమ.. అదో అందమైన అనుభూతి. ఇద్దరి మధ్య చిగురించి వాళ్లను ఒక్కటి చేసేది ప్రేమ. కవులకు కావాల్సినంత కంటెంట్ ఇచ్చేది ప్రేమే. ఎన్ని కథలు చెప్పుకున్నా మరెన్ని కావ్యాలు చూసినా అంతర్లీనంగా ఉండేది ప్రేమే. లవ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రతీ ఒక్కరి జీవితంలో ఈ ప్రేమ పార్ట్ ఉంటుంది. అది జీవితాంతం వెంటాడుతుంది. అలా ఓ వ్యక్తి తన లవ్ గురించి సోషల్ మీడియాలో పంచుకున్న మ్యాటర్ చదివితే ప్రేమ అలా కూడా పుడుతుందా అని అనేస్తాం.
బెంగళూరు మెట్రోపాలిటన్ సిటీ. ఐటీ హబ్. ట్రాఫిక్ కష్టాల గురించి చెప్పడానికి మాటలు రావు. అనుభవించడానికి ధైర్యం సరిపోదు. కిలోమీటర్ దూరానికే గంటల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి. కానీ ఓ వ్యక్తి మాత్రం ఆ ట్రాఫిక్ జామ్ వల్లే తనకు మంచి జరిగిందంటూ చెప్పుకొస్తున్నాడు. అక్కడే తన లవ్‌ను సెట్ చేసుకున్నాని వివరిస్తున్నాడు. మూడేళ్ల క్రితం బెంగళూరులోని సోనీ వరల్డ్ సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ జామ్‌లో తను ఓ అమ్మాయిని కలుసుకున్నాడట. ఆ తర్వాత ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఓ రోజు తనను ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తున్న సమయంలో ఎజిపురా బ్రిడ్జీ దగ్గర భారీగా ట్రాఫిక్ స్తంభించింది. అందులో ఇరుక్కుపోయిన ఈ ఇద్దరు గంటల కొద్దీ వేయిట్ చేశారు. ఎంతకూ ట్రాఫిక్ క్లియర్ కాలేదు. ఓ వైపు సమయం గడుస్తోంది మరోవైపు ఆకలి వేస్తోంది. దీంతో ఇద్దరూ కలిసి పక్కనే ఉన్న ఓ రెస్టారెంట్ కు వెళ్లి డిన్నర్ చేశారు. అక్కడే టేస్టీ ఫుడ్ తీసుకుంటున్న సమయంలో ఇద్దరి టేస్టులు కలిశాయి. ఒకరి అభిరుచులూ మరొకరికి నచ్చాయి. ఇద్దరి మధ్య చనువు పెరిగి ప్రేమ చిగురించింది.
అలా మొదలైన వారిద్దరి కథ దాదాపు మూడేళ్ల పాటు కొనసాగింది. మూడేళ్లు డేటింగ్ చేశాక రెండేళ్ల క్రితమే పెళ్లి కూడా చేసుకున్నాడు. అంతకుముందు ముఖపరిచయం ఉన్న అమ్మాయి ట్రాఫిక్ జామ్ వల్ల లవర్‌గా ఆ తర్వాత వైఫ్‌గా మారిందని చెప్పుకొచ్చాడు. ఇలా తన మెమరబుల్ లవ్ స్టోరీని రెడిట్‌లో పోస్ట్ చేశాడు. బాటమ్ లైన్‌లో మాత్రం ఆ అమ్మాయిని కలిసి మూడేళ్లయ్యిందని పెళ్లై రెండేళ్లు అయ్యిందని కానీ ఇప్పటికీ రెండున్నర కిలోమీటర్ల బ్రిడ్జీ నిర్మాణం మాత్రం ఇప్పటికీ కొనసాగుతూనే ఉందని సెటైర్ వేశాడు. అంతే ఈ పోస్ట్ కాస్తా వైరల్ గా మారింది.
అయితే ఈ లవ్‌స్టోరీకి నెటిజెన్స్ కనెక్ట్ అయ్యారు. తమకు జరిగిన అనుభవాలతో పాటు బ్రిడ్జీ నిర్మాణంపై ఫన్ అండ్ ఫ్రస్టేషన్ కామెంట్స్‌ను పోస్ట్ చేస్తున్నారు. ఇది గొప్ప బెంగుళూరు కథ అని ఒకరు కామెంట్ చేయగా చెత్త బాలీవుడ్ సినిమాల కంటే ఇది మంచి ప్రేమకథ అంటూ మరొకరు రియాక్షన్ ఇచ్చారు. తాను బెంగళూరులో ఉన్నన్ని రోజులు ఆ ఫ్లై ఓవర్ నిర్మాణంలోనే ఉందంటూ ఓ యూజర్ స్పందించగా మరొకరు మాత్రం నిర్మాణం ప్రారంభించిన తర్వాత తాను స్కూలింగ్, కాలేజీ స్టడీ కూడా పూర్తి చేసుకున్నానంటూ రియాక్షన్ ఇచ్చాడు. తన కుమార్తె జూనియర్ కాలేజీలో జాయిన్ అయ్యిందని తర్వాత గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసుకుని మాస్టర్స్ లో కూడా చేరిందని అయినా ఫ్లై ఓవర్ పూర్తి కాలేదంటూ ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. ఒక నెటిజన్ అయితే లొకేషన్ క్లియర్‌గా చెప్తే తన పెళ్లికాని స్నేహితుడిని పంపుతానంటూ కామెంట్ చేశాడు.