Sandeshkhali Violence Case: షాజ్ హాన్ షేక్ ను అరెస్ట్ చేసిన బెంగాల్ పోలీసులు
Sandeshkhali Violence Case: 55 రోజులుగా పరారీలో ఉన్న షాజహాన్ షేక్
Sandeshkhali Violence Case:పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో చోటుచేసుకున్న హింసాకాండ ఘటన ప్రధాన నిందితుడు, అధికార తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్ షేక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలో షాజహాన్ షేక్‌ను ప్రత్యేక పోలీసు బృందం అర్ధరాత్రి అరెస్టు చేశారు.టీఎంసీ నేత షాజహాన్ షేక్ 55 రోజులుగా పరారీలో ఉన్నాడు. ఈ నేపధ్యంలో షాజహాన్ షేక్ కార్యకలాపాలపై పోలీసుల బృందం నిఘా పెట్టిందని అధికారులు తెలిపారు. షాజహాన్ షేక్‌ను పోలీసులు బసిర్‌హత్ కోర్టుకు తరలించారు.
జనవరి 5న సందేశ్‌ఖాలీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు జరిపింది. రేషన్ పంపిణీ కుంభకోణంపై దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు షేక్ ఇంటిపై దాడి చేశారు. ఆ తరువాత షాజహాన్ షేక్ పరారయ్యాడు. ఈ నేపధ్యంలో షేక్‌తోపాటు అతని మద్దతుదారులు స్థానికుల భూమిని ఆక్రమించారని, మహిళలను లైంగికంగా వేధిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. వెంటనే షేక్‌ను అరెస్టు చేయాలంటూ సందేశ్‌ఖాలీ ప్రాంతంలో పలువురు నిరసనలు చేపట్టారు. కొద్ది రోజుల్లో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఈ అరెస్ట్ చేసినట్లు బీజేపీ ఆరోపిస్తుంది.