దుర్గా పూజను సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చిన యునెస్కో.. ధన్యవాదాలు చెబుతూ భారీ ర్యాలీ నిర్వహించిన సీఎం మమతా బెనర్జీ

West Bengal: పశ్చిమ బెంగాల్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే దుర్గా నవరాత్రులను ‍యునెస్కో.. వారసత్వ జాబితాలో చేర్చింది.

Update: 2022-09-01 10:14 GMT

దుర్గా పూజను సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చిన యునెస్కో.. ధన్యవాదాలు చెబుతూ భారీ ర్యాలీ నిర్వహించిన సీఎం మమతా బెనర్జీ

West Bengal: పశ్చిమ బెంగాల్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే దుర్గా నవరాత్రులను ‍యునెస్కో.. వారసత్వ జాబితాలో చేర్చింది. ఇందుకు ధన్యవాదాలు చెబుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భారీ ర్యాలీ నిర్వహించారు. దుర్గాపూజను సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చడంపై దీదీ ఆనందం వ్యక్తం చేశారు. దుర్గా దేవి శరన్నవరాత్రులంటే వెంటనే గుర్తొచ్చేది పశ్చిమ బెంగాల్ రాజధాని కోలకతా అని చెప్పక తప్పదు. నవరాత్రుల సమయంలో ఇక్కడ కాళీ మాత మండపాలు భారీగా దర్శనమిస్తుంటాయి. అలాంటి కోల్‌కతాకు ఆ పేరు రావడం వెనుక ఓ కారణం ఉందని చెబుతారు.

కోల్‌కతా అనేది బెంగాలీ భాషలోని కాలిక్ క్షేత్ర అనే పదం నుంచి వచ్చింది. కాలిక్ క్షేత్ర అంటే కాళికా దేవి కొలువైన స్థలం అని అర్థం. అలాగే కాళీ ఘాట్ పదం నుంచి కోల్‌కతా అనే పేరొచ్చినట్టు పురాణాలు చెబుతున్నాయి. కోల్‌కతాలోని కాళీ ఘాట్ కాళీ దేవి ఆలయానికి 200 ఏళ్ల చరిత్ర ఉన్నట్టు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఈ క్రమంలో బెంగాల్‌లో జరిగే దసరా పూజలకు వారసత్వ జాబితాలో చోటు దక్కడంపై బెంగాళీలు సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News