Bengal: సంచలనం సృష్టిస్తోన్న ప్రశాంత్ కిశోర్ ఆడియో టేప్
Bengal: బెంగాల్ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ప్రతి చిన్నఅవకాశాన్ని కూడా పార్టీలు వదులుకోవడం లేదు.
Bengal: బెంగాల్ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ప్రతి చిన్నఅవకాశాన్ని కూడా పార్టీలు వదులుకోవడం లేదు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆడియో టేపులు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ఇంతకీ ప్రశాంత్ కిశోర్ ఎటువంటి కామెంట్స్ చేశారు ? బీజేపీ ఏవిధంగా స్పందించింది? కాషాయపార్టీ నేతలకు పీకే ఏ విధమైన కౌంటర్ ఇచ్చారు.
బెంగాల్ దంగల్‌లో ఫేజ్ ఫేజ్‌కు సీన్ మారిపోతోంది. తాజాగా బెంగాల్‌లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆడియో టేప్ సంచలనం సృష్టిస్తోంది. బెంగాల్‌లో మమత బెనర్జీకి ఎంత ప్రజాదరణ ఉందో అదే స్థాయిలో మోడీకి కూడా ఉందంటూ పీకే చెప్పినట్లు వస్తున్న వార్తలను బీజేపీ తెలివిగా వాడుకుంటోంది. పీకే చేసిన వ్యాఖ్యలతో టీఎంసీ పనైపోయిందంటూ బీజేపీ ప్రచారం మొదలుపెట్టింది. బెంగాల్‌లో ప్రధాని మోడీకి ఆదరణ విపరీతంగా పెరిగిందని కొన్ని ప్రాంతాల్లో బీజేపీ భారీ విజయాలను సొంతం చేసుకుంటుందంటూ పీకే మాటలు మీడియాలో హల్చల్ చేశాయ్.
మమత బెనర్జీపై వ్యతిరేకత, బీజేపీకి అనుకూలంగా పొలరైజేషన్, దళిత ఓట్లతో బీజేపీకి సానుకూల వాతవరణం ఉందన్న పీకే వ్యాఖ్యలు పెద్ద కుదుపునకు కారణమయ్యాయి. క్లబ్ హౌస్ జర్నలిస్టులతో పీకే సంభాషణలను బీజేపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అమిత్ మాలవ్య పోస్టు చేయడంతో మొత్తం వ్యవహారం వైరల్ అయ్యింది.
అయితే ఆడియో సంభాషణలపై పీకే స్పందించారు. కొందరు కావాలని వారికి కావాల్సిన వర్షన్ మాత్రమే లీక్ చేశారని దమ్ము, ధైర్యముంటే మొత్తం మాట్లాడిన టేపులను విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. జనంలోకి వెళ్లి ఎన్నికల్లో గెలవాల్సిందిపోయి క్లబ్ హౌస్ చాట్లను సీరియస్‌గా తీసుకోవడం చూస్తే బీజేపీ పరిస్థితేంటో అర్థమైపోతుందంటూ పీకే ట్వీట్ చేశారు. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ వంద సీట్లను దాటి గెలుచుకోదంటూ మరోసారి పీకే తేల్చిచెప్పారు.