అక్కడ టమోటా, పెట్రోల్ కంటే బీర్లు అగ్గువ..! కారణం ఏంటో తెలుసా..?

Tomato Price: గత కొన్ని రోజులుగా టమోట ధరలు విపరీతంగా పెరిగాయి

Update: 2021-12-13 07:30 GMT

అక్కడ టమోటా, పెట్రోల్ కంటే బీర్లు అగ్గువ..! కారణం ఏంటో తెలుసా..?

Tomato and Beer Prices in Goa: గత కొన్ని రోజులుగా టమోట ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ సంగతి వినియోగదారులందరికి తెలుసు. అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగి కొన్ని రోజులు మార్కెట్లోకి టమోట రాలేదు. దీంతో వాటికి డిమాండ్‌ పెరిగి ధరలు చుక్కలనంటాయి. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు టమోట ధరలు తగ్గినా గోవాలో మాత్రం పాత పరిస్థితే కొనసాగుతుంది. అక్కడ టమోట, పెట్రోల్‌ కంటే బీరు అగ్గువగా దొరుకుతుంది. రెండింటి ధరలు దాదాపు రూ.100కి చేరుతున్నాయి.

నివేదిక ప్రకారం టమోటాలు కిలో రూ.70 పలుకుతోంది. కిలో టొమాటో కంటే లోకల్ బీర్ చౌకగా లభిస్తుంది. అంతేకాదు 750 ml కింగ్‌ఫిషర్ లేదా టూబర్గ్‌ బీర్‌ రూ.85కి లభిస్తుంది. ఈ బీర్ల ధరకంటే కూరగాయల ధరలు మండిపోతున్నాయి. రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం గోవాలో లీటర్ పెట్రోల్ రూ.96, డీజిల్ రూ.87కు లభిస్తోంది. పెట్రోలు, డీజిల్ రిటైల్ ధర కంటే రెట్టింపు స్థాయిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు విధించాయి.

మరోవైపు గోవాలో మద్యంపై పన్ను రేటు దేశంలోనే అత్యల్పంగా ఉంది. కానీ కూరగాయల కోసం పొరుగు రాష్ట్రాలపై ఆధారపడవలసిందే. నివేదిక ప్రకారం రాష్ట్రంలోని హుబ్లీ, బెల్గాంకు రోజు సుమారు 150 టన్నుల టమోటాలు తీసుకువస్తారు. ఇప్పుడు టమాటా కంటే బంగారం కూడా జేబులో తేలికగా ఉంటుందని కొందరు దుకాణదారులు వాపోతున్నారు. హోటళ్ల వద్ద టమోట వాడటం మానేసారు. కొన్ని కుటుంబాలు వాటిని చాలా తక్కువ పరిమాణంలో కొనుగోలు చేస్తున్నాయి. 

Tags:    

Similar News