Chandi Mata: పూజారి గంట కొట్టగానే పరిగెత్తుకుంటూ వస్తున్న ఎలుగుబంట్లు
Chandi Mata: చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతంలోని గుట్టపై కొలువైన ఆ అమ్మవారిని సన్నిధికి చేరుకోగానే క్రూర జంతువులు సైతం సాధు జంతువులుగా మారిపోతున్నాయి.
Chandi Mata: చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతంలోని గుట్టపై కొలువైన ఆ అమ్మవారిని సన్నిధికి చేరుకోగానే క్రూర జంతువులు సైతం సాధు జంతువులుగా మారిపోతున్నాయి. అమ్మవారికి హారతి ఇచ్చే సమయంలో గంట శబ్దం విని అక్కడికి వస్తున్న ఎలుగుబంట్లు దర్శనం చేసుకుని పూజరి పెట్టిన ప్రసాదం తీసుకుని అడవిలోకి వెళ్లిపోతున్నాయి. ఎలుగుబంట్లు తరచుగా వచ్చే ఈ ఆలయం ఎక్కడుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి.
ఛత్తీస్ గడ్ లోని బాగబాహారలోని చండీ దేవి ఆలయానికి సామాన్య భక్తులతో పాటు ప్రతీ రోజు అమ్మవారిని దర్శించుకునేందుకు ఎలుగుబంట్లు సైతం వస్తుంటాయి. అడవిలో ఎంతో క్రూరంగా ప్రవర్తించే ఈ ఎలుగుబంట్లు అమ్మవారి సన్నిధికి చేరుకోగానే సామాన్య భక్తులలో కలిసిపోతున్నాయి. ఈ ఆలయానికి దగ్గరలో ఉన్న అటవీ ప్రాంతంలో ఎక్కువగా సంచరించే ఎలుగుబంట్లు గత 20 ఏళ్లుగా ప్రతీరోజు అమ్మవారి ఆలయానికి వస్తున్నాయి.
ప్రతీ రోజు ఆలయంలో అమ్మవారికి హారతి ఇచ్చే సమయంలో పూజారి శంఖం ఊదడం ఆనవాయితీగా వస్తోంది. శంఖం శబ్దం విన్న ఎలుగుబంట్లు గుంపులుగా ఆలయం దగ్గరకు చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటున్నాయి. అమ్మవారి సన్నిధిలో ఉన్న భక్తులకు ఎలాంటి హానీ తలపెట్టకుండా పూజారి పెట్టిన ప్రసాదం, భక్తులు ఇచ్చిన పానీయాలు తీసుకుని అడవిలోకి తిరిగి వెళ్లిపోతున్నాయి. అమ్మవారి సన్నిధి దాటి అటవీ ప్రాంతంలోకి వెళ్లగానే అవి క్రూర జంతువుల్లానే ప్రవర్తిస్తున్నాయి.
సాధారణంగా ఎలుగుబంట్లు క్రూర జంతువుల వలే ప్రవర్తిస్తాయి. అయితే ఈ ఆలయానికి వచ్చే ఎలుగుబంట్లు మాత్రం సాధు జంతువుల్లా ఆలయంలో భక్తులు ఎంతమంది ఉన్నా ఎవరికీ హానీ తలపెట్టడం లేదు. ఇదంతా చండీ దేవి మహిమగా భక్తులు విశ్వసిస్తున్నారు.