BCCI: ఐపీఎల్ భాగస్వామిగా 'అప్ స్టాక్స్' డిజిటల్ సంస్థ
BCCI: ఐపీఎల్ భాగస్వామిగా డిజిటల్ బ్రోకరేజి సంస్థ "అప్ స్టాక్స్" అధికారిక భాగస్వామిగా వ్యవహరించనుందని ఐపీఎల్ తెలిపింది.
BCCI: ఐపీఎల్ భాగస్వామిగా డిజిటల్ బ్రోకరేజి సంస్థ "అప్ స్టాక్స్" అధికారిక భాగస్వామిగా వ్యవహరించనుందని బీసీసీఐ అధీనంలోని ఐపీఎల్ పాలకమండలి ప్రకటన చేసింది. రాబోయే కొన్ని సంవత్సరాల పాటు ఈ భాగస్వామ్యం కొనసాగనుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దీనిపై ఐపీఎల్ చైర్మన్ బ్రజేశ్ పటేల్ మాట్లాడుతూ, ఐపీఎల్ తో 'అప్ స్టాక్స్' ఒప్పందం కుదుర్చుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 'అప్ స్టాక్స్' ఎంతో వేగంగా వృద్ధి చెందుతున్న డిజిటల్ ట్రేడింగ్ ప్లాట్ ఫాం అని వెల్లడించారు. 'అప్ స్టాక్స్' తో కలిసి ఐపీఎల్ కూడా మరింతగా విస్తరిస్తుందని భావిస్తున్నామని చెప్పారు.
ఇషాన్ పై సెహ్వాగ్ ప్రశంసల వర్షం..
టీమిండియా యువ ఆటగాడు ఇషాన్ కిషన్‌పై భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి ప్రశంసల వర్షం కురిపించాడు. ఇషాన్ ఇంకా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) భ్రమలోనే ఉన్నాడని.. అందుకే తన విధ్వంసాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడన్నాడు. ఇంగ్లండ్‌తో ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఓపెనర్‌గా ఆడిన ఇషాన్ (56: 32 బంతుల్లో 5x4, 4x6) మెరుపు హాఫ్ సెంచరీ బాదిన విషయం తెలిసిందే.